LOADING...
Stock Market: బ్యాంకింగ్ షేర్ల జోరుతో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్న దేశీయ మార్కెట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్న దేశీయ మార్కెట్లు

Stock Market: బ్యాంకింగ్ షేర్ల జోరుతో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్న దేశీయ మార్కెట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. రానున్న రోజుల్లో బ్యాంకింగ్ రంగం మెరుగైన వృద్ధిని నమోదు చేసి, మంచి లాభాలు అందించే అవకాశాలున్నాయనే అంచనాలు మార్కెట్లో వినిపిస్తున్నాయి. దీంతో మదుపర్లు బ్యాంకింగ్ రంగ షేర్ల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రభావంతో బ్యాంకింగ్ సూచీలు బలపడగా, దేశీయ ప్రధాన సూచీలు కూడా గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. అయితే, సోమవారం నమోదైన లాభాల అనంతరం గరిష్ఠ స్థాయిల వద్ద కొంతమంది మదుపర్లు లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్)కు మొగ్గుచూపడం మార్కెట్‌పై కొంత ఒత్తిడిని తీసుకొచ్చింది. అయినప్పటికీ, సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతోనే ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 95.33 వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

నిఫ్టీ కూడా సెన్సెక్స్ ధోరణినే అనుసరిస్తోంది

గత ట్రేడింగ్ సెషన్‌లో 78,285వద్ద ముగిసిన సెన్సెక్స్,మంగళవారం ఉదయం ప్రారంభంలో దాదాపు 200 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అనంతరం కొంత మేర లాభాలను కోల్పోయిన సూచీ,ఉదయం 9:30గంటల సమయంలో 27పాయింట్లు పెరిగి 78,312వద్ద కొనసాగుతోంది. ఇక నిఫ్టీ కూడా సెన్సెక్స్ ధోరణినే అనుసరిస్తోంది. ప్రస్తుతం 12పాయింట్ల లాభంతో 24,442వద్ద ట్రేడవుతోంది. వ్యక్తిగత షేర్ల విషయానికి వస్తే జుబిలెంట్ ఫుడ్స్, స్విగ్గీ, టైటాన్ కంపెనీ,ఎల్‌టీఎమ్, ఆల్కెమ్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు ట్రెంట్, కల్యాణ్ జువెల్లర్స్, కొచిన్ షిప్‌యార్డ్, బీఎస్‌ఈ లిమిటెడ్, వెర్నోవా టీడీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రంగాల వారీగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ 207 పాయింట్ల లాభంతో ట్రేడవుతుండగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ మాత్రం 200పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది.

Advertisement