Loading...
Income Tax: ట్యాక్స్‌ పేయర్లకు బిగ్‌ రిలీఫ్‌.. నేటి నుంచే విదేశీ ఆస్తుల వెల్లడికి వన్‌టైమ్‌ విండో
ట్యాక్స్‌ పేయర్లకు బిగ్‌ రిలీఫ్‌.. నేటి నుంచే విదేశీ ఆస్తుల వెల్లడికి వన్‌టైమ్‌ విండో

Income Tax: ట్యాక్స్‌ పేయర్లకు బిగ్‌ రిలీఫ్‌.. నేటి నుంచే విదేశీ ఆస్తుల వెల్లడికి వన్‌టైమ్‌ విండో

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2026
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అవకాశం కల్పించింది. విదేశాల్లో ఉన్న ఆస్తులు, ఆదాయ వివరాలను గతంలో తమ ఐటీ రిటర్నుల్లో వెల్లడించని వారికి వన్‌టైమ్‌ విండోను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) తెలిపింది. ఈ ప్రత్యేక అవకాశం ఆగస్టు 16 నుంచి డిసెంబర్‌ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ పథకం కింద ఈ ఏడాది మార్చి 31 నాటికి పన్ను చెల్లింపుదారుల పేరుతో ఉన్న విదేశీ బ్యాంకు ఖాతాలు, ఆస్తులు, ఆభరణాలు, లిస్టెడ్‌, అన్‌లిస్టెడ్‌ సెక్యూరిటీల వంటి ఆస్తులను వెల్లడించవచ్చు. గతంలో విదేశీ ఆస్తుల వివరాలను ఐటీఆర్‌లో పేర్కొనని వారికి ఈ వన్‌టైమ్‌ విండో ఉపయోగపడనుంది.

వివరాలు

రూ.1 కోటి వరకు ఆస్తులు ఉంటే..

రూ.1 కోటి వరకు విదేశీ ఆస్తులు లేదా ఆదాయం ఉన్నప్పటికీ వాటిని ఐటీఆర్‌లో వెల్లడించని పన్ను చెల్లింపుదారులకు ఈ పథకం వర్తిస్తుంది.

అలాగే రూ.5 కోట్ల వరకు విదేశీ పెట్టుబడులు ఉండి వాటి వివరాలను వెల్లడించని వారికి కూడా అవకాశం కల్పించారు.

ఆగస్టు 16 నుంచి డిసెంబర్‌ 31లోపు ఫారమ్‌-1 ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు

30+30 శాతం పన్ను

రూ.1 కోటి వరకు విదేశీ ఆస్తులు లేదా ఆదాయం ఉండి, వాటిని ఐటీఆర్‌లో వెల్లడించని వారు మొత్తం 60 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఇందులో 30 శాతం పన్నుతోపాటు దానికి సమానమైన మరో 30 శాతం అదనపు పన్ను ఉంటుంది.

ఇక రూ.5 కోట్ల వరకు విదేశీ ఆదాయం ఉన్నవారు, ఎన్ఆర్ఐగా ఉన్న సమయంలో ఆయా ఆస్తులను ఐటీఆర్‌లో వెల్లడించకపోయినా రూ.1 లక్ష ఫ్లాట్‌ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు

పన్ను చెల్లింపుదారులు ఏం చేయాలి?

అర్హత ఉన్న పన్ను చెల్లింపుదారులు ముందుగా ఫారమ్‌-1 ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అనంతరం చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించిన సమాచారాన్ని ఐటీ శాఖ ఫారమ్‌-2 ద్వారా అందిస్తుంది.

నోటీసు అందిన రెండు నెలల్లోపు సంబంధిత మొత్తాన్ని చెల్లించాలి. నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే ఆలస్యమైన ప్రతి నెలకు 1 శాతం చొప్పున అదనపు వడ్డీ భరించాల్సి ఉంటుంది.

అయితే మనీలాండరింగ్‌ నిరోధక చట్టం లేదా నల్లధనం నిరోధక చట్టం కింద ఇప్పటికే కేసులు లేదా విచారణ ఎదుర్కొంటున్న ఆస్తులకు ఈ పథకం వర్తించదని ఐటీ శాఖ స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు

ఎలాంటి విదేశీ ఆస్తులు వెల్లడించాలి?

భారతదేశ పన్ను నివాసితులుగా ఉన్న వ్యక్తులు విదేశాల్లో తమ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్‌ ఫండ్లు, ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్స్‌, జీవిత బీమా పాలసీలు, స్థిరాస్తులు తదితర వివరాలను ఐటీఆర్‌లో తప్పనిసరిగా వెల్లడించాలి.

గతంలో ఈ ఆస్తులు లేదా వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఐటీఆర్‌లో పేర్కొనకపోతే.. ఈ వన్‌టైమ్‌ విండోను ఉపయోగించుకుని నిర్ణీత పన్ను, పెనాల్టీలు చెల్లించడం ద్వారా వాటిని వెల్లడించే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT