Bls Polymers Ipo: BLS పాలీమర్స్ షేర్లకు అదిరిపోయే లిస్టింగ్.. ఇన్వెస్టర్లకు 65% లాభం
ఈ వార్తాకథనం ఏంటి
స్టాక్ మార్కెట్‌లో BLS పాలీమర్స్ షేర్లు అదిరిపోయే అరంగేట్రం చేశాయి. నవంబర్ 3న ఎన్‌ఎస్‌ఈలో ఒక్కో షేరు రూ.248 వద్ద లిస్టింగ్ అయింది. ఐపీఓ ఇష్యూ ధర రూ.150తో పోలిస్తే ఇది 65.33 శాతం అధికం. బీఎస్‌ఈలో రూ.244.10 వద్ద లిస్టింగ్ అయి 62.73 శాతం లాభాన్ని అందించింది. ఈ లిస్టింగ్‌తో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.1,514.20 కోట్లకు చేరింది. గ్రే మార్కెట్‌లో అంచనా వేసిన 46 శాతం ప్రీమియం కంటే వాస్తవ లిస్టింగ్ లాభం ఎక్కువగా నమోదైంది.
వివరాలు
ఐపీఓకు భారీ స్పందన
BLS పాలీమర్స్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 1.19 కోట్ల షేర్లకు గాను 287.05 కోట్ల షేర్ల కోసం బిడ్లు వచ్చాయి.
దీంతో ఐపీఓ 241.22 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎన్‌ఐఐ) విభాగం 559.20 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ) విభాగం 200.25 రెట్లు, రిటైల్ విభాగం 128.36 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి.
ఈ ఐపీఓ అక్టోబర్ 27న ప్రారంభమై 29న ముగిసింది. ఒక్కో షేరుకు రూ.142 నుంచి రూ.150 వరకు ధరల శ్రేణిని నిర్ణయించారు.
మొత్తం 1.7 కోట్ల ఈక్విటీ షేర్లను పూర్తిగా తాజా ఇష్యూ ద్వారా విక్రయించారు.
వివరాలు
కొనాలా? అమ్మాలా? హోల్డ్ చేయాలా?
మౌలిక సదుపాయాల రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు BLS పాలీమర్స్‌కు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక దృష్టితో షేర్లను హోల్డ్ చేయవచ్చని లేదా కొంత లాభాలను బుక్ చేసుకోవచ్చని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయం కలిగిన BLS పాలీమర్స్ వివిధ పారిశ్రామిక అవసరాల కోసం ప్రత్యేక పాలిమర్ కాంపౌండ్లను తయారు చేస్తుంది.
విద్యుత్,టెలికాం,రైల్వే రంగాల్లో ఉపయోగించే వైర్లు,కేబుళ్ల ఇన్సులేషన్, కోటింగ్ కోసం కంపెనీ ఉత్పత్తులను వినియోగిస్తారు.
అలాగే చమురు, గ్యాస్, నీటి పైప్‌లైన్లను తుప్పు నుంచి రక్షించేందుకు కూడా వీటిని ఉపయోగిస్తారు.
ప్రస్తుతం గోవాలో 11 ప్రత్యేక యంత్రాలతో కూడిన తయారీ కేంద్రాన్ని కంపెనీ నిర్వహిస్తోంది. ఎంపిక చేసిన ఉత్పత్తుల తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు విస్తరణ చేపడుతోంది.