బీపీఓ ఉద్యోగాలపై AI తీవ్రమైన ఎఫెక్ట్: నాస్కామ్ చైర్మన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కారణంగా బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్(BPO) వంటి రంగాల్లోని ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ చైర్మన్ రాజేష్ నంబియార్ తెలిపారు. పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నంబియార్.. ఏఐ టెక్నాలజీపై కీలక వ్యాఖ్యలుచేశారు. నంబియార్ ప్రస్తుతం కాగ్నిజెంట్ ఇండియాకు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. భారతీయ టెక్నాలజీ పరిశ్రమకు మూలస్తంభం సాఫ్ట్‌వేర్ సేవల పరిశ్రమ అని ఆయన అన్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఏఐ ప్రభావం బీపీఓలపై మాత్రమే ప్రభావం తీవ్రంగా చూపుతుందని స్పష్టం చేశారు. అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు ఏఐ నైపుణ్యాల్లో ట్రైనింగ్ ఇచ్చేందుకు భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నట్లు చెప్పారు.