NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Budget 2025 :నిర్మలా సీతారామన్ 8వ 'బడ్జెట్' తేదీ, సమయం, లైవ్ స్ట్రీమ్,ఎక్కడ చూడొచ్చు? 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Budget 2025 :నిర్మలా సీతారామన్ 8వ 'బడ్జెట్' తేదీ, సమయం, లైవ్ స్ట్రీమ్,ఎక్కడ చూడొచ్చు? 
    నిర్మలా సీతారామన్ 8వ 'బడ్జెట్' తేదీ, సమయం, లైవ్ స్ట్రీమ్,ఎక్కడ చూడొచ్చు?

    Budget 2025 :నిర్మలా సీతారామన్ 8వ 'బడ్జెట్' తేదీ, సమయం, లైవ్ స్ట్రీమ్,ఎక్కడ చూడొచ్చు? 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 27, 2025
    12:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వారం చివరిలో, అంటే ఫిబ్రవరి 1న బడ్జెట్ 2025​ను ప్రవేశపెట్టనున్నారు.

    ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత, ఇది ఆమె ప్రవేశపెట్టే 8వ బడ్జెట్.

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చాక, ఇది నిర్మల ప్రవేశపెడుతున్న రెండో పూర్తి బడ్జెట్.

    ఈ నేపథ్యంలో బడ్జెట్​కి సంబంధించిన వివరాలు ఇక్కడ చూద్దాం.

    వివరాలు 

    బడ్జెట్ 2025 - తేదీ, సమయం: 

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025 న పార్లమెంట్‌లో బడ్జెట్ 2025ని ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు లోక్ సభలో ఆమె ప్రసంగం ప్రారంభమవుతుంది.

    గత నాలుగు కేంద్ర బడ్జెట్లతో పాటు, 2025-26 కేంద్ర బడ్జెట్ కూడా కాగిత రహిత రూపంలోనే ఉండనుంది.

    ప్రతి ఏడాదిలా, ఈసారి కూడా మధ్యతరగతి ప్రజలు బడ్జెట్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారికోసం ఆదాయపు పన్ను విషయంలో ఊరట కలగవచ్చని భావిస్తున్నారు.

    వివరాలు 

    బడ్జెట్ 2025 - ఎలా చూడాలి? 

    కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్ అధికారిక ఛానళ్లలో, దూరదర్శన్, సంసద్ టీవీలలో ప్రసారం చేయనున్నారు.

    ఇది ప్రభుత్వ అధికారిక యూట్యూబ్ ఛానెల్స్‌లో కూడా ప్రసారం అవుతుంది.

    బడ్జెట్ 2025 గురించే అన్ని తాజా సమాచారం, న్యూస్ బైట్స్ తెలుగు బడ్జెట్ లైవ్ బ్లాగ్‌లో పొందవచ్చు.

    బడ్జెట్ పత్రాలకు డిజిటల్ యాక్సెస్ కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్ పోర్టల్ www.indiabudget.gov.in ద్వారా అందుబాటులో ఉంటుంది.

    రాజ్యాంగం నిర్దేశించిన వార్షిక ఆర్థిక ప్రకటన (సాధారణంగా బడ్జెట్ అని పిలువబడే) డిమాండ్ ఫర్ గ్రాంట్స్ (డీజీ), ఫైనాన్స్ బిల్లు వంటి కేంద్ర బడ్జెట్ పత్రాలు 'యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్'లో అందుబాటులో ఉంటాయి. ఈ డాక్యుమెంట్లు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో లభిస్తాయి.

    వివరాలు 

    బడ్జెట్ 2025కు ముందు హల్వా వేడుక - దీని ప్రాముఖ్యత ఏమిటి? 

    1980వ దశకం నుంచి భారతీయ బడ్జెట్ తయారీప్రక్రియలో భాగంగా ఉన్న హల్వావేడుక,కేంద్ర బడ్జెట్ తయారీ చివరి దశను సూచిస్తుంది.

    ఈ వేడుక తరువాత,బడ్జెట్‌ను తయారు చేసిన అధికారులను నార్త్ బ్లాక్‌లోని గదిలో లాక్ చేస్తారు.తరువాత బడ్జెట్ విడుదల చేస్తారు.

    2025 బడ్జెట్ తయారీ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది?

    ఆర్థిక మంత్రిత్వ శాఖ 2024 అక్టోబరులో బడ్జెట్ తయారీని ప్రారంభించింది.రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాలు,అవసరాలను ఖరారు చేయడానికి వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చలు జరుపుతుంది.

    2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అనేక సాంప్రదాయ బడ్జెట్ లక్షణాలను తొలగించింది.

    2017లో రైల్వే బడ్జెట్‌ను ప్రధాన బడ్జెట్‌లో కలపడం,బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి 1కి మార్చడం, 2021లో డిజిటల్ ఫార్మాట్‌కు మార్చడం జరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బడ్జెట్‌ 2025

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    బడ్జెట్‌ 2025

    Budget 2025 : బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట లభించనుందా? బిజినెస్
    New Income Tax Act: బడ్జెట్ 2025 ఆదాయపు పన్ను చట్టాన్ని కొత్త ప్రత్యక్ష పన్ను కోడ్‌తో భర్తీ చేస్తుందా?   బిజినెస్
    Budget : బడ్జెట్ 2025.. ఆదాయ శ్లాబ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందా?  పన్ను
    Halwa Ceremony: నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో హల్వా వేడుక.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025