Page Loader
Akshaya Tritiya 2025: అక్షయ తృతీయకు కొనుగోలు చేసే బంగారం హాల్‌మార్కింగ్‌ను ఎలా చెక్‌ చేయాలో తెలుసా?
అక్షయ తృతీయకు కొనుగోలు చేసే బంగారం హాల్‌మార్కింగ్‌ను ఎలా చెక్‌ చేయాలో తెలుసా?

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయకు కొనుగోలు చేసే బంగారం హాల్‌మార్కింగ్‌ను ఎలా చెక్‌ చేయాలో తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2025
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

అక్షయ తృతీయ పేరొచ్చిందంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బంగారం.ఆ రోజు బంగారాన్ని కొనుగోలు చేస్తే శ్రీవంతం,సిరిసంపదలు లభిస్తాయనే నమ్మకం సమాజంలో బలంగా ఉంది. అందుకే ప్రతి ఏటా ఈ రోజు బంగారం కొనాలనే ఉత్సాహంతో జనం నగల షాపుల వద్ద తగుమునలు చేస్తుంటారు. ఈఆసక్తిని ఓ అవకాశంగా మార్చుకుని నగల షాపులు కూడా ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటాయి. ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10న వస్తోంది. మీరు కూడా ఆ రోజున బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ముందు బంగారపు నాణ్యతను గుర్తించే పద్ధతులు తెలుసుకోవాలి. ఎందుకంటే కేవలం మెరుపుతో మాయ చేయడం కాదు, నిజమైన నాణ్యతతో పాటు ప్రభుత్వ గుర్తింపు కూడా ఉన్నదా అన్నది ముఖ్యమైన అంశం.

వివరాలు 

బంగారం నాణ్యతకు ప్రభుత్వ హాల్‌మార్క్ కీలకం 

భారత ప్రభుత్వం వినియోగదారుల హక్కుల రక్షణ కోసం BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థే దేశంలో బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్‌కు నియమాలను రూపొందిస్తుంది. హాల్‌మార్క్ ఆధారంగానే ఆభరణం శుద్ధమైనదా కాదా అన్నదాన్ని నిర్ధారించవచ్చు. 2021లో ప్రభుత్వం బంగారంపై హాల్‌మార్క్ తప్పనిసరి చేసింది. అనంతరం, 2023 ఏప్రిల్ 1 నుంచి దేశంలోని ప్రతి నగల వ్యాపారి 6 అంకెల గుర్తింపు సంఖ్య (HUID)తో కూడిన ఆభరణాలు మాత్రమే విక్రయించాల్సిందిగా నిబంధన చేసింది.

వివరాలు 

హాల్‌మార్క్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన 3 అంశాలు 

BIS లోగో: బంగారు ఆభరణంపై త్రిభుజాకారంలో BIS అనే గుర్తు ఉండాలి. ఇది ఆ ఆభరణానికి హాల్‌మార్క్ ఉన్నదని మొదటిచెప్పే సంకేతం. స్వచ్ఛత గ్రేడ్ (ప్యూరిటీ గ్రేడ్): బంగారం ప్యూరిటీ అంటే అది ఎంత క్యారెట్ ఉందన్నదే. 24 క్యారెట్లు అంటే 100% స్వచ్ఛమైన బంగారం. కానీ నగలు తయారీకి ఇతర లోహాలు కూడా కలిపే కారణంగా వాటిని 14K, 18K, 22K వంటి గ్రేడ్‌లలో తయారుచేస్తారు. 22KT అంటే 91.6% బంగారం (గుర్తు: 22K916) 18KT అంటే 75% బంగారం (గుర్తు: 18K750) 14KT అంటే 58.5% బంగారం (గుర్తు: 14K585) ఈ గుర్తుల ఆధారంగా మీరు కొనుగోలు చేసే ఆభరణం ప్యూరిటీ స్థాయిని అర్థం చేసుకోవచ్చు.

వివరాలు 

6 అంకెల HUID కోడ్: 

ప్రతి బంగారు ఆభరణం ఓ ప్రత్యేక 6 అంకెల ఆల్ఫా న్యూమరిక్ HUID కోడ్‌తో ఉండాలి. ఇది ఆ ఆభరణానికి ప్రత్యేకమైన గుర్తింపు. మీరు BIS కేర్ యాప్‌ ద్వారా ఈ HUID కోడ్‌ను స్కాన్ చేసి, ఆ బంగారం నిజమైనదా, హాల్‌మార్క్ ఉన్నదా, ఏ రిజిస్టర్డ్ డీలర్ వద్ద తయారయిందో అన్నవన్నీ తెలుసుకోవచ్చు. అక్షయ తృతీయ అనేది శుభదినం. ఆ రోజున బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయం. కానీ నిజమైన ఆభరణాన్ని, నాణ్యమైన బంగారాన్ని ఎంపిక చేసుకోవడం వినియోగదారుడిగా మీ బాధ్యత. BIS హాల్‌మార్క్, ప్యూరిటీ గ్రేడ్, మరియు HUID కోడ్‌లు ఉన్న నగలతోనే మీ కొనుగోలును బలపరచండి.