
Electric buses: 2027 నాటికి భారత్‌లో రోడ్ల పైకి 50,000 ఎలక్ట్రిక్ బస్సులు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో ఎలక్ట్రిక్ బస్సులను పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.
ఈ మేరకు 2027 నాటికి అమెరికా సాయంతో భారత్‌లో 50,000 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
390 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 3253.78 కోట్లు) విలువైన అమెరికాతో కలిసి జాయింట్ ఫైనాన్స్ మెకానిజాన్ని భారత్ అభివృద్ధి చేసింది.
భారతదేశంలో ప్రస్తుతం 12,000 ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే నడుస్తున్నాయి.
ఉత్పత్తిని పెంచడానికి రుణాలు కోరుతున్న తయారీదారులకు జాయింట్ ఫైనాన్స్ మెకానిజం అనేది భరోసాగా ఉంటుందని అమెరికా-భారత్ అధికారులు పేర్కొన్నారు. COP28 సదస్సులో ఈ మేరకు ప్రకటించారు
బస్సు
భారత్‌లో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసం..
భారత్‌లో ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసం చెల్లింపు భద్రతా వ్యవస్థ భారత ప్రభుత్వం నుంచి భారత్ 240 మిలియన్ల డాలర్లు, అమెరికాతో పాటు దాతృత్వ సంస్థలకు చెందిన 150 మిలియన్ డాలర్లతో జాయింట్ ఫైనాన్స్ మెకానిజంను ఏర్పాటు చేశారు.
ఇది భారతదేశంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసం ఆర్థిక వ్యవస్థను రూపొందించడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వ అధికారి మహువా ఆచార్య తెలిపారు.
తయారీదారులకు నష్టాలను తగ్గించడానికి కొత్త ఫండ్ మెకానిజం రూపొందించబడింది.
ప్రస్తుతం దేశంలో 12000 ఈ-బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. కొత్త ఫండ్ మెకానిజం ద్వారా ఎలక్ట్రిక్ బస్సుల ధరలను తగ్గించే దిశగా భారత్ కసరత్తు చేస్తోంది.