BYJU సంస్థకు చెందిన కోడింగ్ ప్లాట్‌ఫారమ్ WhiteHat Jr మూసివేత
Edtech దిగ్గజ సంస్థ BYJU'S కోడింగ్ ప్లాట్‌ఫారమ్ WhiteHat Jrని కొనుగోలు చేసినప్పుడు, అది అప్పట్లో సరైన నిర్ణయం. ఆ తర్వాత ఎన్నో విమర్శలు ఈ రెండు సంస్థలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు, BYJU'S నష్టాలను తగ్గించుకోవడానికి కోడింగ్ ప్లాట్‌ఫారమ్‌ను మూసేయాలని ఆలోచిస్తోంది. మహమ్మారి edtech సంస్థలపై, ముఖ్యంగా BYJU'స్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. బైజూ రవీంద్రన్ నేతృత్వంలోని సంస్థ కొత్త ఆదాయ మార్గాలను వెతకడంలో ఇబ్బంది పడింది. దాని ఆదాయం క్షీణించడం, నష్టాలు పెరగడంతో, కంపెనీ ఖర్చులను తగ్గించుకునే మార్గాల కోసం వెతికింది. BYJU సంస్థలో 2021 ఆర్ధిక సంవత్సరంలో నష్టాలు రూ. 4,588 కోట్లు, అందులో WhiteHat Jr నష్టాలు 36.8% అంటే రూ. 1,690 కోట్లు.
BYJU'S WhiteHat Jrని $300 మిలియన్లకు కొనుగోలు చేసింది
BYJU'S WhiteHat Jrని $300 మిలియన్లకు కొనుగోలు చేసింది, అభివృద్ది కోసం $235 మిలియన్లు ఖర్చు చేసింది. BYJU'Sకు WhiteHat Jrతో ఆర్థిక సమస్యలే కాదు, పేలవమైన బోధన నాణ్యత, ప్రణాళిక లేని మార్కెటింగ్ వ్యూహాలపైన కూడా ఆరోపణలు ఎదుర్కొంది. సంస్థ అలా ఆరోపించిన, విమర్శించిన కొందరిపై డెఫినిషన్ కేసు దాఖలు చేశాక పరిస్థితి తీవ్రమైంది. తర్వాత దావాను ఉపసంహరించుకున్నప్పటికీ, అటువంటి చర్యలు BYJU'S ప్రతిష్టను దిగజార్చాయి. BYJU'S ఈ నెల ప్రారంభంలో, కంపెనీ ఖర్చులను తగ్గించడానికి 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. దీని తర్వాత, రవీంద్రన్ ఇక కోతలు ఉండవని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అయితే సిబ్బందిని స్వచ్ఛందంగా రాజీనామా చేసేలా కంపెనీ బెదిరింపు వ్యూహాలను ఉపయోగిస్తోందని మాజీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.