Page Loader
CAIT: పేమెంట్ల కోసం పేటీఎంను వాడకండి.. ఇతర యూపీఐలను వినియోగించండి: సీఏఐటీ
CAIT: పేమెంట్ల కోసం పేటీఎంను వాడకండి.. ఇతర యూపీఐలను వినియోగించండి: సీఏఐటీ

CAIT: పేమెంట్ల కోసం పేటీఎంను వాడకండి.. ఇతర యూపీఐలను వినియోగించండి: సీఏఐటీ

వ్రాసిన వారు Stalin
Feb 04, 2024
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

పేటీఎం(Paytm)పై ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విక్రయదారుల సమాఖ్య కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) దేశవ్యాప్తంగా వ్యాపారులకు కీలక సలహాను జారీ చేసింది. ఈ సందర్భంగా సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ బార్టీయా, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. పేటీఎం వినియోగదారులు తమ డబ్బును రక్షించుకోవడానికి తక్షణమే అప్రమత్తం కావాలన్నారు. పేటీఎం ద్వారా కాకుండా ఇతర UPIల ద్వారా లావాదేవీలు జరపాలని పేటీఎం వినియోగదారులకు సూచించారు.

పేటీఎం

ఒక్క పాన్ కార్డుకు వెయ్యి పేటీఎం పేమెంట్ బ్యాంక్‌‌ ఖాతాల లింకు

పేటీఎం పేమెంట్ బ్యాంక్‌ ఖాతాల కేవైసీ ప్రక్రియ పూర్తి కాలేదు. అంతేకాదు గుర్తింపు లేకుండానే కోట్లాది రూపాయల లావాదేవీలు కూడా జరిగాయి. దీంతో మనీలాండరింగ్ జరిగే అవకాశం ఏర్పడింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్‌‌పై నిషేదానికి మరో అతిపెద్ద కారణం ఏంటంటే.. వెయ్యికి పైగా ఖాతాలు ఒకే పాన్‌తో లింక్ చేబడ్డాయి. దీన్ని ఆర్‌బీఐ తీవ్రంగా పరిగణించింది. అందుకే వ్యాపారులు తమ మనీ రిస్క్‌ను తగ్గించుకోవడానికి పేటీఎం నుంచి తమ డబ్బును వెంటనే ఉపసంహరించుకోవాలని భార్టియా, ఖండేల్‌వాల్‌లకు సూచించారు.