Canva: కాన్వాలో ఉద్యోగాల కోత.. 22 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన
ఈ వార్తాకథనం ఏంటి
ఖర్చులను తగ్గించుకోవడం, సాంకేతిక వ్యవస్థలను మరింత సరళీకరించడం, కృత్రిమ మేధ (ఏఐ), వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇతర రంగాలపై పెట్టుబడులను పెంచడం వంటి కారణాలతో పలు సంస్థలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్‌వేర్ సంస్థ కాన్వా చేరింది. తమ ప్రపంచవ్యాప్త ఉద్యోగుల్లో దాదాపు 22 శాతం మందిని, అంటే 1,271 మందిని తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
వివరాలు
సహాయ ప్యాకేజీ ప్రకటన
గత పదేళ్లలో తొలిసారిగా సంస్థ వృద్ధి వేగం తగ్గిందని, వ్యాపారాన్ని పునర్‌వ్యవస్థీకరించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాన్వా సీఈఓ మెలానీ పెర్కిన్స్ వెల్లడించారు.
ఉద్యోగాల కోతతో పాటు కొందరి బాధ్యతల్లో మార్పులు చేయడం,మరికొందరిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం వంటి చర్యలు కూడా చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.
ఉద్యోగాల కోతతో ప్రభావితమయ్యే వారికి సహాయ ప్యాకేజీని కూడా ప్రకటించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాన్వాలో 22 శాతం ఉద్యోగులపై వేటు..
Australian tech giant Canva will slash 22% of its workforce and is asking some staff to relocate overseas as the company attempts streamline its business.
— The Daily Telegraph (@dailytelegraph) November 4, 2026
More updates coming: https://t.co/QlPjR3VLAf pic.twitter.com/lqO6PFNTix