Loading...
Bonus Ceiling Limit: ఉద్యోగులకు దసరా ధమాకా.. బోనస్ పరిమితి రూ.7 వేల నుంచి రూ.21 వేలకు?
ఉద్యోగులకు దసరా ధమాకా.. బోనస్ పరిమితి రూ.7 వేల నుంచి రూ.21 వేలకు?

Bonus Ceiling Limit: ఉద్యోగులకు దసరా ధమాకా.. బోనస్ పరిమితి రూ.7 వేల నుంచి రూ.21 వేలకు?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2026
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ దసరా పండగ సందర్భంగా భారీ ఆర్థిక ప్రయోజనం అందే అవకాశం ఉందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. దసరా, దీపావళి పండగల సీజన్‌ దగ్గరపడుతున్న సమయంలో ఉద్యోగుల బోనస్‌కు సంబంధించి కీలక డిమాండ్ తెరపైకి వచ్చింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బోనస్‌ను లెక్కించే గరిష్ఠ పరిమితిని పెంచాలని కోరింది. ప్రస్తుతం ఉన్న రూ.7,000 పరిమితిని రూ.21,000కు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు NC-JCM కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా కేబినెట్ సెక్రెటరీకి లేఖ రాశారు.

వివరాలు 

కనీస వేతనం పెరిగిన నేపథ్యంలో..

ఇటీవల కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ.21,000గా నిర్ణయించారు.

బోనస్ చట్టం ప్రకారం బోనస్ లెక్కించేటప్పుడు రూ.7,000లేదా ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం.. ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఉంటే దానినే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ నిబంధనను అమలు చేయాలని ఉద్యోగుల జేఏసీ కోరుతోంది.2026 మేలో జరిగిన 49వ జేసీఎం సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.

బోనస్ చట్టంలో వచ్చిన మార్పుల ఆధారంగా బోనస్ లెక్కింపు పరిమితిని పెంచే అంశాన్ని పరిశీలిస్తామని అధికారులు అప్పట్లో హామీ ఇచ్చినట్లు జేఏసీ పేర్కొంది.

మరోవైపు.. 2026 ఆగస్టు 25న ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ 2026 నవంబర్ 21 నుంచి అమల్లోకి రానుంది.

వివరాలు 

ఎవరికి ప్రయోజనం?

అయితే బోనస్ పరిమితి పెంపును అప్పటి వరకు వేచి చూడకుండా వెంటనే అమలు చేయాలని జేఏసీ కోరింది.

కనీసం 2026 అక్టోబర్ 20న జరగనున్న దసరా పండగకు ముందే దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది.

సాధారణంగా లెవెల్-8 వరకు ఉన్న నాన్-గెజిటెడ్ ఉద్యోగులు, సీ-గ్రేడ్, బీ-గ్రేడ్ ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) లేదా అడ్‌హాక్ బోనస్ అందుతుంది.

బోనస్ లెక్కింపు పరిమితిని రూ.21,000కు పెంచితే ఈ కేటగిరీల్లోకి వచ్చే అర్హత కలిగిన ఉద్యోగులందరికీ ప్రయోజనం కలగనుంది.

ADVERTISEMENT

వివరాలు 

ఎవరికి ప్రయోజనం?

ప్రస్తుతం బోనస్‌ను సాధారణంగా 30.4 రోజుల సగటును ప్రాతిపదికగా తీసుకుని 60 లేదా 70 రోజుల చొప్పున లెక్కిస్తారు. రూ.7,000 పరిమితిని ఆధారంగా తీసుకుంటే గణన ఇలా ఉంటుంది:

బోనస్ = రూ.7,000 ÷ 30.4 × 30 = సుమారు రూ.6,908

అంటే ప్రస్తుతం రూ.7,000 సీలింగ్‌ కారణంగా అర్హత ఉన్న ఉద్యోగులకు లభించే అడ్‌హాక్ బోనస్ దాదాపు రూ.6,908 నుంచి రూ.7,000 మధ్య ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

రూ.21 వేలకు పెంచితే ఎంత?

బోనస్ లెక్కింపు పరిమితిని రూ.7,000 నుంచి రూ.21,000కు పెంచితే.. గణనకు ఉపయోగించే గరిష్ఠ మొత్తం ఏకంగా మూడు రెట్లు పెరుగుతుంది.

ఫలితంగా అర్హత కలిగిన ఉద్యోగులకు పండగ బోనస్ సుమారు రూ.20,700 నుంచి రూ.21,000 వరకు ఉండే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు అందరి దృష్టి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఉంది. NC-JCM లేఖపై కేంద్ర కేబినెట్ సానుకూలంగా స్పందించి అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తే.. ఈసారి దసరా పండగకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో గతంతో పోలిస్తే భారీగా బోనస్ జమయ్యే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT