Loading...
TRAI: స్పామ్‌ కాల్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. టెలికాం సంస్థలకు ట్రాయ్‌ జరిమానాలు?
స్పామ్‌ కాల్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. టెలికాం సంస్థలకు ట్రాయ్‌ జరిమానాలు?

TRAI: స్పామ్‌ కాల్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. టెలికాం సంస్థలకు ట్రాయ్‌ జరిమానాలు?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 07, 2026
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

అవాంఛిత ఫోన్‌ కాల్స్‌, సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎంఎస్‌) విషయంలో నిబంధనలు ఉల్లంఘించే టెలికాం నెట్‌వర్క్‌ సంస్థల (టెల్కోలు)పై నేరుగా జరిమానాలు విధించే అధికారాన్ని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌)కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలో ట్రాయ్‌కు పరిమిత అధికారాలే ఉండటంతో జరిమానాల విధింపులో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెలికాం సంస్థలపై చర్యలు తీసుకునే అధికారాన్ని ట్రాయ్‌కే కట్టబెట్టే దిశగా కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 2022 నుంచి దేశంలో అవాంఛిత ఫోన్‌ కాల్స్‌, సందేశాలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు క్రమంగా పెరుగుతున్నాయి. వీటిలో 82 శాతానికి పైగా అన్‌రిజిస్టర్డ్‌ టెలిమార్కెటర్ల నుంచే వస్తున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

వివరాలు

నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు

ప్రస్తుతం ఏదైనా టెలికాం ఆపరేటర్‌ అవాంఛిత కాల్స్‌, మెసేజ్‌లకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినట్లు ట్రాయ్‌ గుర్తిస్తే.. సదరు సంస్థకు జరిమానా విధించాలని టెలికాం శాఖకు (డాట్‌) సిఫారసు చేయాల్సి ఉంటుంది.

అయితే చట్టపరమైన, సాంకేతికపరమైన సమస్యల కారణంగా ట్రాయ్‌ చేసిన జరిమానా సిఫారసులకు అనుగుణంగా డాట్‌ ఆదేశాలను అమలు చేయలేకపోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు టెలికాం సంస్థలపై జరిమానాలు విధించే ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా ట్రాయ్‌కు నేరుగా జరిమానాలు విధించే అధికారాన్ని కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది.

వివరాలు

పెరుగుతున్న అవాంఛిత కాల్స్‌ ఫిర్యాదులు

మరోవైపు పెస్టీ కాల్స్‌ (అవాంఛిత వాణిజ్య కాల్స్‌)పై వినియోగదారుల ఫిర్యాదులు భారీగా నమోదవుతున్నాయి.

ఈ ఏడాది ప్రథమార్ధంలోనే వీటికి సంబంధించి 20.75 లక్షల ఫిర్యాదులు అందాయి.

2025లో నమోదైన మొత్తం 31.09 లక్షల ఫిర్యాదుల్లో ఈ సంఖ్య 66 శాతానికి సమానంగా ఉంది.

ADVERTISEMENT

వివరాలు

గత కొన్నేళ్లలో నమోదైన ఫిర్యాదుల వివరాలు పరిశీలిస్తే..

- 2021: 12.84 లక్షల ఫిర్యాదులు

2022: 10.83 లక్షల ఫిర్యాదులు

2023: 13.62 లక్షల ఫిర్యాదులు

2024: 19.38 లక్షల ఫిర్యాదులు

2025: 31.09 లక్షల ఫిర్యాదులు

ఈ గణాంకాలను బట్టి అవాంఛిత కాల్స్‌, సందేశాలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఈ నేపథ్యంలో టెలికాం సంస్థలపై జరిమానాలు విధించే అధికారాన్ని ట్రాయ్‌కు నేరుగా అప్పగిస్తే నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవడం మరింత సులభతరం కానుంది.

ADVERTISEMENT