Page Loader
ఆకాశ ఎయిర్ లైన్స్‌ మూసివేతపై.. సీఈఓ క్లారిటీ 
ఆకాశ ఎయిర్ లైన్స్‌ మూసివేతపై.. సీఈఓ క్లారిటీ

ఆకాశ ఎయిర్ లైన్స్‌ మూసివేతపై.. సీఈఓ క్లారిటీ 

వ్రాసిన వారు Stalin
Sep 20, 2023
05:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆకస్మికంగా పైలెట్ల రాజీనామాలు చేయడంతో ఆకాశ ఎయిర్ లైన్స్ కంపెనీ తీవ్ర ఆందోళనలను ఎందుర్కొంటోంది. ఈ క్రమంలో ఆకాశ ఎయిర్ లైన్స్ మూసివేస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై ఆకాశ ఎయిర్ సీఈఓ వినయ్ దూబే స్పందించారు. ఎయిర్‌లైన్‌ను మూసివేయడం లేదని ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా తెలియజేశారు. పైలట్‌ల రాజీనామాల కారణంగా ఎయిర్‌లైన్ తన కార్యకలాపాల్లో అంతరాయాన్ని ఎదుర్కొంటున్న విషయాన్ని దూబే అంగీకరించారు. రాజీనామాల వల్ల జులై-సెప్టెంబర్ మధ్య విమానాలకు అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. దీని వల్ల చివరి నిమిషంలో ఫ్లైట్లు రద్దు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. జూనియర్ పైలట్లు తమ నోటీస్ పీరియడ్లను పూర్తి చేయకుండా ఆకస్మికంగా వెళ్లిపోయినప్పుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆకస్మిక రాజీనామాలతో ఆకాశ ఎయిర్ లైన్స్‌కు ఇబ్బందులు