
Stock market: వరుసగా ఆరో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 187, నిఫ్టీ 41 పాయింట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో ట్రేడింగ్ రోజునూ లాభాలతోనే ముగిశాయి.
గ్లోబల్ మార్కెట్ల నుంచి స్పష్టత లేని సంకేతాలు వస్తున్నా కూడా మన దేశ మార్కెట్లు స్థిరంగా పుంజుకున్నాయి.
ముఖ్యంగా, దినసరి వినియోగ వస్తువులు (FMCG) బ్యాంకింగ్ రంగాల షేర్లలో బలమైన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పాజిటివ్‌గా కొనసాగాయి.
గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ సుమారు 6,000 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం అది 80,000 పాయింట్ల మార్క్‌ను అందుకునే దశలో ఉంది.
వివరాలు
విదేశీ కరెన్సీ మారకంలో రూపాయి విలువ 85.19
ఈ రోజు ట్రేడింగ్‌ను సెన్సెక్స్ 79,728.39 వద్ద లాభాల్లో ప్రారంభించింది,ఇది నిన్నటి ముగింపు 79,408.50 పాయింట్ల కంటే అధికం.
ట్రేడింగ్ అంతటా లాభాల్లోనే కదలికలు కనబరిచింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో గరిష్ఠంగా 79,824.30 పాయింట్లను చేరింది.
చివరికి 187 పాయింట్ల లాభంతో 79,595.59 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 41.70 పాయింట్ల లాభంతో 24,167.25 వద్ద స్థిరపడింది.
విదేశీ కరెన్సీ మారకంలో రూపాయి విలువ డాలరుతో పోల్చితే 85.19 వద్ద కొనసాగుతోంది.
వివరాలు
బంగారం ధర ఔన్స్‌కు 3,477 డాలర్లు
సెన్సెక్స్‌లోని టాప్ షేర్లలో ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జొమాటో (ఎటర్నెల్) లాంటి కంపెనీలు గణనీయంగా లాభపడ్డాయి.
ఇక నష్టాల్లో నిలిచిన కంపెనీల్లో ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు సుమారు 67 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ధర ఔన్స్‌కు 3,477 డాలర్ల వద్ద కొనసాగుతోంది.