Page Loader
Cognizant:ట్రైజెట్టో నుంచి వ్యాపార రహస్యాలను ఇన్ఫోసిస్‌ దొంగిలించిందని.. కాగ్నిజెంట్‌ సంచలన ఆరోపణలు
ట్రైజెట్టో నుంచి వ్యాపార రహస్యాలను ఇన్ఫోసిస్‌ దొంగిలించిందని.. కాగ్నిజెంట్‌ సంచలన ఆరోపణలు

Cognizant:ట్రైజెట్టో నుంచి వ్యాపార రహస్యాలను ఇన్ఫోసిస్‌ దొంగిలించిందని.. కాగ్నిజెంట్‌ సంచలన ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2025
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలైన కాగ్నిజెంట్ (Cognizant), ఇన్ఫోసిస్ (Infosys) మధ్య పోరు కొనసాగుతోంది. యూఎస్‌లో ఓ దావా పై ఈ రెండు సంస్థలు గత కొంతకాలంగా పోరాడుతున్నాయి. ఈ పరిణామంలో, కాగ్నిజెంట్‌ ఇన్ఫోసిస్‌పై తీవ్ర ఆరోపణలు చేసినట్లు సమాచారం అందుతోంది. తమ హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ ట్రెజెట్టో నుండి వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్‌ దొంగిలించిందని కాగ్నిజెంట్‌ ఆరోపించింది. ఈ విషయాన్ని ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు వెలువడుతున్నాయి. నాన్ డిస్‌క్లోజర్ అండ్ యాక్సెస్ అగ్రిమెంట్ (NDAAs) ద్వారా ట్రెజెట్టో వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేస్తూ ఇన్ఫోసిస్‌ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిందని కాగ్నిజెంట్‌ ఆరోపించింది. ఈ విషయంలో ఆడిట్‌ నిర్వహించడానికి ఆ కంపెనీ నిరాకరించిందని కూడా కాగ్నిజెంట్‌ పేర్కొంది.

వివరాలు 

 2022అక్టోబర్‌లో సంస్థను విడిచి పెట్టిన రవికుమార్‌

2024 ఆగస్టులో,కాగ్నిజెంట్‌ అమెరికా కోర్టులో దావా వేసింది.దీనిలో ట్రెజెట్టో నుండి వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్‌ దొంగిలించిందని ఆరోపించింది. ఇన్ఫోసిస్‌ ఈ ఆరోపణలను తిరస్కరించింది.కాగ్నిజెంట్‌ హెల్త్‌కేర్ సొల్యూషన్స్‌ బహిరంగంగా ఉన్నాయని పేర్కొంది. అదేవిధంగా, ప్రస్తుతం కాగ్నిజెంట్‌లో ఉన్న రవికుమార్‌ ఇన్ఫోసిస్‌ మీద,తమ వద్ద పనిచేసిన సమయంలో హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ విడుదల చేయడాన్ని ఆలస్యం చేశారని ప్రత్యారోపణలు చేసింది. అలాగే,కాగ్నిజెంట్‌లో ఉద్యోగం కోసం చర్చలు జరిపారని తెలిపారు. ఇన్ఫోసిస్‌ అధ్యక్షుడిగా వ్యవహరించిన రవికుమార్‌ 2022అక్టోబర్‌లో ఆ సంస్థను విడిచిపెట్టారు. ఆ తరువాతి ఏడాది జనవరిలోనే కాగ్నిజెంట్‌లో సీఈఓగా చేరారు.ఈరెండు ఐటీ కంపెనీలు ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో పోటీ పడుతున్నాయి. ఇన్ఫోసిస్‌ తన ఆదాయం నుండి దాదాపు 7.5శాతం లైఫ్ సైన్సెస్ విభాగం నుంచి పొందుతోంది.