Gas Prices: చమురు సంక్షోభం ప్రభావం.. మళ్లీ భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర.. లేటెస్ట్ రేట్లు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పై కూడా పడుతోంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మరోసారి షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచాయి. ఈ పెంపు వెంటనే అమల్లోకి రావడంతో వ్యాపార వర్గాలపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికే మార్చి నెలలో డొమెస్టిక్ మరియు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కమర్షియల్ సిలిండర్లపై మాత్రమే ధరలు పెంచడం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.195.50 పెరిగి రూ.2078.50కి చేరింది. మార్చి 31 వరకు ఇదే సిలిండర్ ధర రూ.1884.50గా ఉండేది.
వివరాలు
హైదరాబాద్‌లో రూ.2300
కోల్‌కతాలో ధరలు మరింతగా పెరిగాయి. అక్కడ రూ.218 పెరుగుదలతో 19 కిలోల సిలిండర్ ధర రూ.2208కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో ప్రస్తుతం ఈ సిలిండర్ ధర రూ.2031గా ఉంది. చెన్నైలో రూ.2248.50గా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే మార్చిలో రూ.144కు పైగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర రూ.2105కు చేరగా.. తాజా పెంపుతో ఇప్పుడు రూ.2300 మార్క్ దాటింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. ఇక గృహ వినియోగానికి ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.965గా ఉంది. ఢిల్లీలో రూ.913, చెన్నైలో రూ.928.50, ముంబైలో రూ.912.50గా కొనసాగుతున్నాయి.
వివరాలు
చమురు కంపెనీలపై భారం..
ప్రధాన మెట్రో నగరాల్లో చూస్తే గృహ గ్యాస్ ధర హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉండటం విశేషం. ఇక గృహ వినియోగానికి ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.965గా ఉంది. ఢిల్లీలో రూ.913, చెన్నైలో రూ.928.50, ముంబైలో రూ.912.50గా కొనసాగుతున్నాయి. ప్రధాన మెట్రో నగరాల్లో చూస్తే గృహ గ్యాస్ ధర హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉండటం విశేషం. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో క్రూడాయిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చమురు కంపెనీలపై భారం పెరగడంతో ధరల పెంపు తప్పనిసరి అయింది.
వివరాలు
పెట్రోల్,డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ టాక్స్ విధానం
మార్చి నెలలో హైదరాబాద్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెరగగా, కమర్షియల్ సిలిండర్ ధర రూ.144 మేర పెరిగింది. అంతేకాకుండా ఇటీవల ప్రీమియం పెట్రోల్, ఇండస్ట్రియల్ డీజిల్ ధరలను కూడా పెంచిన చమురు సంస్థలు, పెట్రోల్,డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ టాక్స్ విధానాన్ని మళ్లీ అమలు చేస్తున్నాయి.