LOADING...
Commercial LPG Price Cut: వ్యాపారులకు ఊరట.. 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర భారీగా తగ్గింపు
వ్యాపారులకు ఊరట.. 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర భారీగా తగ్గింపు

Commercial LPG Price Cut: వ్యాపారులకు ఊరట.. 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర భారీగా తగ్గింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2026
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ సంస్థలు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను భారీగా తగ్గించాయి. ఈ ఏడాదిలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర తగ్గించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కొత్త ధరలు జూలై 1 నుంచే అమల్లోకి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.183.50 తగ్గించడంతో ధర రూ.3,113.50 నుంచి రూ.2,930కు చేరింది. కోల్‌కతాలో రూ.174 తగ్గడంతో కొత్త ధర రూ.3,081.50గా నిర్ణయించారు. చండీగఢ్‌లో రూ.181.50 తగ్గింపుతో సిలిండర్ ధర రూ.2,954.50కు చేరగా, పాట్నాలో రూ.173 తగ్గడంతో రూ.3,227గా ఉంది. అలాగే హైదరాబాద్‌లో రూ.176 తగ్గింపుతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,191కు చేరింది.

వివరాలు 

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం

ఈ ధరల తగ్గింపుకు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పడిపోవడమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 60రోజుల పాటు పొడిగించడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. అలాగే ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై ఉన్న ఒత్తిడి తగ్గడంతో కూడా చమురు మార్కెట్‌కు ఊరట లభించింది. అయితే గృహ వినియోగదారులకు ఈసారి కూడా ఎలాంటి ఉపశమనం లభించలేదు. 14.2కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో చమురు కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఢిల్లీలో గృహ వినియోగ సిలిండర్ ధర రూ.942గా కొనసాగుతుండగా,కోల్‌కతాలో రూ.968, ముంబైలో రూ.941.50,చెన్నైలో రూ.957.50, హైదరాబాద్‌లో రూ.994 వద్ద యథాతథంగా కొనసాగుతున్నాయి.

Advertisement