Citigroup: కాపీ పేస్ట్ పొరపాటు.. వేరే ఖాతాలోకి 6 బిలియన్ డాలర్లు జమ!
ఈ వార్తాకథనం ఏంటి
ఒక బ్యాంకు ఉద్యోగి చేసిన చిన్న పొరపాటు భారీ మొత్తంలో డబ్బు బదిలీకి కారణమైంది. సిటీ గ్రూప్ (Citi Group) లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే..?
బ్యాంకు లావాదేవీలను నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి, నగదు బదిలీ ప్రక్రియలో పొరపాటు చేశాడు.
ముందుగా కాపీ చేసిన ఖాతాదారుడి అకౌంట్ నంబరును అనవసరంగా నగదు కాలమ్‌లో పేస్ట్ చేయడంతో ఏకంగా ఆరు బిలియన్ డాలర్లు (రూ. 52 వేల కోట్లు) ఖాతాలోకి జమయ్యాయి.
మరుసటి రోజు ఈ పొరపాటును బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించి సరిచేశారు. 2023 ఏప్రిల్‌లో ఈ సంఘటన జరిగింది. అయితే ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది.
Details
90 నిమిషాల్లోనే సమస్య్ పరిష్కారం
ఇది మాత్రమే కాదు, అదే నెలలో మరోసారి బ్యాంకులో ఇలాంటి పొరపాటు జరిగింది. మరో ఖాతాదారుడి అకౌంట్‌లో భారీ మొత్తం జమైంది.
అయితే 90 నిమిషాల్లోనే ఈ పొరపాటును గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
ఈ ఘటనలపై బ్యాంకు రెగ్యులేటరీ సంస్థలకు సమాచారం అందించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల్లో పేర్కొంది.
ఈ విషయంపై సిటీ గ్రూప్ స్పందించింది. ''నగదు బదిలీ ప్రక్రియలో పొరపాటు జరిగినా వెంటనే సమస్యను గుర్తించి పరిష్కరించామని పేర్కొంది. ఖాతాదారులకు ఎలాంటి నష్టం జరగలేదు.
భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఆటోమేషన్‌ను మెరుగుపరిచామని అన్నారు.