
ఇంటర్నెట్‌లో చర్చకు దారితీసిన CRED సిఈఓ కునాల్ షా జీతం
ఈ వార్తాకథనం ఏంటి
ఫిన్‌టెక్ కంపెనీ CRED చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కునాల్ షా, ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఆస్క్ మి ఎనీథింగ్' సెషన్ లో తన జీతాన్ని వెల్లడించారు. షా తన నెలవారీ జీతం Rs. 15,000 అని పేర్కొనడమే దానికి కారణాన్ని కూడా చెప్పాడు.
CREDలో జీతం చాలా తక్కువగా ఉంది ఎలా సాధ్యం అని ఒక వినియోగదారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కంపెనీ లాభంలో ఉంటే నాకు మంచి జీతం కావాలనుకోను CREDలో నా జీతం నెలకు Rs. 15,000 అయితే గతంలో నా కంపెనీ ఫ్రీచార్జ్‌ని అమ్మాను కాబట్టి ఆ డబ్బుతో నేను జీవించగలను అన్నారు.
సంస్థ
కోట్లలో జీతాలు తీసుకునే సిఈఓల మధ్య మా కునాల్ షా
ఈ సెషన్ స్క్రీన్‌షాట్‌ను వినియోగదారు అజిత్ పటేల్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. స్క్రీన్‌షాట్‌తో పాటు, కోట్లలో జీతాలు తీసుకునే సిఈఓల మధ్య మా కునాల్ షా అని ట్వీట్ చేశారు. .
షేర్ చేసినప్పటి నుండి, పోస్ట్ రెండు వేలకు పైగా లైక్‌లు, 1.4 లక్షల వీక్షణలు వచ్చాయి. అయితే, సిఈఓ చర్యను కొందరు అభినందిస్తే, మరికొందరు పన్ను ఆదా చేయడానికి ఇది ఒక మార్గమని అభిప్రాయపడ్డారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కునాల్ షా గురించి అజిత్ పటేల్ చేసిన ట్వీట్
There are CEOs who take salaries in crores then we have Kunal Shah. 💖 pic.twitter.com/aahaDJmdAm
— Ajeet Patel | Leetcode ⚡ (@Iampatelajeet) February 26, 2023