
రికార్డుస్థాయిలో రూ.2 లక్షల కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ బకాయిలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. చేతిలో ఉంది కదా అని, ప్రతి అవసరానికి క్రెడిట్ కార్డును గీకేస్తున్నారు.
అందుకే క్రెడిట్ కార్డు చెల్లింపులు అన్ని బ్యాంక్ రుణాల కంటే రెండింతలు పెరిగాయి.
మొట్టమొదటిసారిగా గతేడాది ఏప్రిల్‌తో ఈ సారికి క్రెడిట్ కార్డ్‌ల బాకీ రూ.2లక్షల కోట్ల మార్కును దాటింది.
ఒకవైపు అన్ సెక్యూరిటీ లోన్స్ పెరుగుదలపై ఆర్‌బీఐ హెచ్చరించినప్పటికీ, క్రెడిట్ కార్డ్ బకాయిల వాటా తక్కువగా ఉన్నందున పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రుణదాతలు అంటున్నారు.
ఆర్‌బీఐ లెక్కల ప్రకారం ఏప్రిల్ 2023 నాటికి క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లు రూ. 2,00,258 కోట్లకు చేరుకున్నాయి. ఇది ఏప్రిల్ 2022 కంటే 29. 7శాతం ఎక్కువ.
క్రెడిట్
హౌసింగ్ లోన్, వాహన లోన్ తర్వాత మూడో అతిపెద్ద సెగ్మెంట్ క్రెడిట్ కార్డు
ఏప్రిల్ 2023లో క్రెడిట్ కార్డ్‌లను స్వైప్ చేసిన లేదా ఆన్‌లైన్‌లో ఉపయోగించిన మొత్తం విలువ కేవలం రూ. 1.3 లక్షల కోట్లు మాత్రమే.
క్రెడిట్ కార్డ్ లావాదేవీలలో పెరుగుదల సాధారణంగా వినియోగదారుల విశ్వాసానికి కొలమానంగా పరిగణించబడుతుంది.
మొత్తం బ్యాంకుల్లో క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ వాటా 1. 4శాతంగా ఉన్నాయి.
వ్యక్తిగత రుణాల్లో హౌసింగ్ (14. 1%), వాహన రుణాలు (3.7%) తర్వాత క్రెడిట్ కార్డులు మూడవ-అతిపెద్ద సెగ్మెంట్ కావడం గమనార్హం.
2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ముందు కంటే క్రెడిట్ కార్డ్ బకాయిల వాటా 1.2శాతం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఏప్రిల్ 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ క్రెడిట్‌లో పరిశ్రమ వాటా 26. 3% నుంచి 24. 3%కి పడిపోయింది.