Page Loader
Amazon Diagnostic Tests: ఇక ఇంటినుంచే డయాగ్నస్టిక్‌ టెస్టులు.. అమెజాన్‌ కొత్త సర్వీస్‌!
ఇక ఇంటినుంచే డయాగ్నస్టిక్‌ టెస్టులు.. అమెజాన్‌ కొత్త సర్వీస్‌!

Amazon Diagnostic Tests: ఇక ఇంటినుంచే డయాగ్నస్టిక్‌ టెస్టులు.. అమెజాన్‌ కొత్త సర్వీస్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 22, 2025
05:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ భారత్‌లో కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. ఇకపై ఇంటి వద్దే డయాగ్నస్టిక్‌ పరీక్షలు చేయించుకోవచ్చు. అమెజాన్‌ యాప్‌ ద్వారా వినియోగదారులు ల్యాబ్‌ పరీక్షలను బుక్‌ చేసి, అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్‌ చేసుకోవచ్చు. డిజిటల్‌ రిపోర్టులను కూడా యాప్‌ ద్వారానే యాక్సెస్‌ చేయవచ్చు. అమెజాన్‌ డయాగ్నస్టిక్స్‌'ను భారత్‌ లో ప్రవేశపెట్టినట్టు అమెజాన్‌ ఇండియా ప్రకటించింది. యాప్‌ ద్వారా వినియోగదారులు ఇంటికే వచ్చి నమూనా సేకరణ చేయించుకోవచ్చు. 800కుపైగా పరీక్షలను అమెజాన్‌ అందిస్తోంది. అంతేకాకుండా, 'అమెజాన్‌ ఫార్మసీ' ద్వారా ప్రిస్క్రిప్షన్‌ మందులను, ఆరోగ్యానికి అవసరమైన ఉత్పత్తులను కూడా వినియోగదారులకు అందిస్తుంది. ప్రైమ్‌ మరియు నాన్‌-ప్రైమ్‌ సభ్యులకు ఉచిత టెలిమెడిసిన్‌ కన్సల్టేషన్‌ సౌకర్యం, డెలివరీ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

Details

 ఆన్‌లైన్‌ ఫార్మసీ నుంచి డయాగ్నస్టిక్స్‌ వరకు

అమెజాన్‌ గతంలో ప్రారంభించిన ఆన్‌లైన్‌ ఫార్మసీ, టెలికన్సల్టేషన్‌ సేవలకు డయాగ్నస్టిక్స్‌ ను జోడించడం ద్వారా భారత్‌ లోని ఆరోగ్య సంరక్షణ రంగంలో మరింత విస్తరించనుంది. "గ్రాసరీ తర్వాత ఆరోగ్య సంరక్షణ రోజువారీ అవసరమే. మేము ప్రత్యేక లక్ష్యం పెట్టుకోకపోయినా, భారత్‌లో అమెజాన్‌ అందించే సేవల్లో ఇది ఒకటి పెద్దదిగా మారవచ్చని అమెజాన్‌ మెడికల్‌ కేటగిరీ లీడర్‌ జయరామకృష్ణన్‌ బాలసుబ్రహ్మణియన్‌ తెలిపారు. ఆరెంజ్‌ హెల్త్‌తో భాగస్వామ్యం ఈ సేవ కోసం అమెజాన్‌ డయాగ్నస్టిక్స్‌ 'ఆరెంజ్‌ హెల్త్‌'తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తొలుత బెంగళూరు, ఢిల్లీ, గుర్గావ్‌, నోయిడా, ముంబయి, హైదరాబాద్‌ నగరాల్లో అందుబాటులోకి తెచ్చింది. భారత్‌ లో తన ఆరోగ్య సేవలను విస్తరించడానికి అమెజాన్‌ 233 మిలియన్ల డాలర్ల పెట్టుబడిని ఇటీవల ప్రకటించింది.

Details

 పెరుగుతున్న డయాగ్నస్టిక్స్‌ మార్కెట్

రెండేళ్ల క్రితం ఆన్‌లైన్‌ ఫార్మసీని, 6 నెలల క్రితం టెలీకన్సల్టేషన్‌ సేవలను ప్రారంభించిన అమెజాన్‌, ఇప్పుడు డయాగ్నస్టిక్స్‌ రంగంలోకి ప్రవేశించడం భారత్‌ లోని 'దీర్ఘకాలిక అవకాశం' గా చూస్తోంది. డయాగ్నస్టిక్స్‌ రంగంలో అమెజాన్‌ మాత్రమే కాదు, ఇప్పటికే టాటా 1MG, అపోలో 24/7, ఫార్మసీ, నెట్‌మెడ్స్‌ వంటి సంస్థలు కూడా డయాగ్నస్టిక్స్‌ విభాగంలో తమ సేవలను విస్తరించాయి. డయాగ్నస్టిక్స్‌ మార్కెట్‌ లో ఉన్న అధిక లాభాల అవకాశాల కారణంగా పలు పెద్ద కంపెనీలు ఈ రంగంపై దృష్టి పెట్టాయి.