Disney: డిస్నీలో మరోసారి ఉద్యోగాల కోత : 1,000 మందిని తొలగించేందుకు కంపెనీ రెడీ !
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ప్రముఖ వినోద సంస్థ The Walt Disney Company మరోసారి ఉద్యోగ కోతలకు శ్రీకారం చుట్టింది. తాజా చర్యల్లో భాగంగా కంపెనీ మొత్తం మీద సుమారు 1000 మంది ఉద్యోగులను తొలగించనుంది. మార్కెటింగ్, స్టూడియోలు, టెలివిజన్ వ్యాపారం, అలాగే ESPN వంటి విభాగాల్లో ఈ ప్రభావం ఉండనుంది. టీవీ ఆదాయాలు తగ్గడం, సినిమాల కలెక్షన్లు తగ్గిపోవడం, అలాగే రంగంలో పెరిగిన పోటీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కంపెనీ కొత్త సీఈఓ Josh D'Amaro ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో ఈ విషయం వెల్లడించారు.
వివరాలు
2023లో 7000 ఉద్యోగాల కోత
ఇండస్ట్రీ వేగంగా మారుతున్న పరిస్థితుల్లో సంస్థను మరింత చురుకుగా, టెక్నాలజీ ఆధారంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. దాంతో కొన్ని విభాగాల్లో ఉద్యోగాలను తగ్గించాల్సి వస్తుందని చెప్పారు. ఇప్పటికే 2023లో ఖర్చులు తగ్గించేందుకు డిస్నీ 7000 ఉద్యోగాలను కోత పెట్టింది. అప్పట్లో సుమారు 5.5 బిలియన్ డాలర్లను ఆదా చేసింది. ప్రస్తుతం కంపెనీలో సుమారు 2.31 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇదే సమయంలో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, పారామౌంట్ స్కైడాన్స్ వంటి ఇతర హాలీవుడ్ సంస్థలు కూడా ఇదే తరహా ఉద్యోగ కోతలను అమలు చేస్తున్నాయి.