
డీఎల్ఎఫ్ ఫ్లాట్లకు భారీ డిమాండ్, మూడురోజుల్లో 8000కోట్ల ప్రాపర్టీ అమ్మకాలు
ఈ వార్తాకథనం ఏంటి
నగర ప్రాంతాల్లో ఫ్లాట్ల అమ్మకాలకు మంచి గిరాకీ ఉందని చెప్పడానికి ఈ ఉదాహరణ సరిపోతుంది కావచ్చు. కేవలం మూడంటే మూడు రోజుల్లో 8000కోట్ల విలువ చేసే ఫ్లాట్ల అమ్మకాలు పూర్తయ్యాయంటే ఎవ్వరికైనా ఆశ్చర్యం వేస్తుంది.
కానీ ఆ ఆశ్చర్యాన్ని నిజం చేసింది డీఎల్ఎఫ్ సంస్థ. రియల్ ఎస్టేట్స్ రంగంలో దిగ్గజంగా పేరున్న ఈ సంస్థ, గురుగ్రామ్ లో ది ఆర్బర్ పేరుతో గృహ సముదాయాలను నిర్మించింది. 38నుండి 39అంతస్తులు గల 5టవర్లలో మొత్తం 1137ఫ్లాట్లు ఉన్నాయి.
ఒక్కో ఫ్లాట్ ధర 7కోట్లకు పై మాటే. ఈ ఫ్లాట్లను అమ్మకానికి పెడుతున్నట్టు, ఫిబ్రవరి 24న అధికారికంగా డీఎల్ఎఫ్ ప్రకటించింది. ఫిబ్రవరి 15, 16, 17తేదీల్లో.. అంటే కేవలం మూడు రోజుల్లోనే మొత్తం ఫ్లాట్లు అమ్ముడైపోయాయట.
వ్యాపారం
25ఎకరాల్లో నిర్మితమైన గృహ సముదాయం
మొత్తం 3వేల మంది, ఈ ఫ్లాట్ల కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారని, లాటరీ విధానం ద్వారా 1137మందిని ఎంపిక చేసినట్లు డీఎల్ఎఫ్ ప్రకటించింది. ఫ్లాట్ల బుకింగ్ కోసం 800కోట్లు నగదు అందిందని డీఎల్ఎఫ్ సీఈవో అశోక్ త్యాగి తెలియజేసారు.
గురుగ్రామ్ లోని సెక్టార్ 3 లో గల గోల్హ్ కోర్స్ ఎక్స్ టెన్షన్ రొడ్ లో ఈ గృహ సముదాయం ఉంది. మొత్తం 25ఎకరాల్లో ఈ సముదాయాన్ని డీఎల్ఎఫ్ నిర్మించింది.
నాలుగు బెడ్ రూమ్ లు కలిగిన ఈ ఫ్లాట్లు, 3950చదరపు అడుగుల వైశాల్యాన్ని కలిగి ఉండి, విలాసవంతంగా ఉంటాయి. ఈ ఫ్లాట్ల కొనుగోలుకు ఇండియా వారితో పాటు ఇతర దేశాల నుండి కూడా డిమాండ్ వచ్చిందని సీఈవో తెలియజేసారు.