LOADING...
Smart Financial Planning: రూ.5 లక్షలు ఉన్నాయా?.. స్మార్ట్‌గా పెట్టబడి పెడితే స్థిరమైన ఆదాయం పొందచ్చు!
రూ.5 లక్షలు ఉన్నాయా?.. సరైన ఇన్వెస్ట్ చేస్తే డబ్బే డబ్బు..!

Smart Financial Planning: రూ.5 లక్షలు ఉన్నాయా?.. స్మార్ట్‌గా పెట్టబడి పెడితే స్థిరమైన ఆదాయం పొందచ్చు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 30, 2026
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితులు, యుద్ధ మేఘాలు, టెక్నాలజీలో వేగంగా జరుగుతున్న మార్పుల ప్రభావంతో స్టాక్ మార్కెట్, బంగారం వంటి పెట్టుబడుల్లో తీవ్ర ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఈ అనిశ్చిత వాతావరణంలో తమ కష్టార్జిత సంపాదనను ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక సాధారణ ప్రజలు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక నిపుణులు పలు ముఖ్య సూచనలు చేస్తున్నారు. సీనియర్ సిటిజన్లలో చాలామంది బ్యాంక్ ఎఫ్డీలను అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. అయితే అక్కడ కూడా మిస్-సెల్లింగ్ సమస్యలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎఫ్డీలను యూలిప్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లకు మార్చాలని ఒత్తిడి చేసి ఇబ్బందులకు గురిచేసే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

వివరాలు

11 శాతం వరకు స్థిరమైన వడ్డీ

మరోవైపు మధ్యతరగతి ప్రజలు తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని ఆశించి మైక్రో ఫైనాన్స్, అనధికారిక చిట్టీల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు. "ఎక్కడ రాబడి ఎక్కువగా ఉంటే, అక్కడ రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది" అనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ మార్పుల ప్రభావం తక్కువగా ఉండే, స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి డెట్ ఇన్స్ట్రుమెంట్స్, మున్సిపల్ బాండ్స్ మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని చెబుతున్నారు. ప్రభుత్వ బాండ్లు, మంచి రేటింగ్ ఉన్న కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడి పెడితే సుమారు 9 శాతం నుంచి 11 శాతం వరకు స్థిరమైన వడ్డీ పొందే అవకాశం ఉంది.

వివరాలు

మెరుగైన రాబడిని పొందచ్చు

ఇది సాధారణ బ్యాంక్ ఎఫ్డీలతో పోలిస్తే మెరుగైన రాబడిగా భావించవచ్చు. అదనంగా పన్ను ఆదా దృష్ట్యా భార్య లేదా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబ సభ్యుల పేర్లపై ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా సుమారు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు 'ఫోమో' (Fear of Missing Out)కి లోనవకుండా, నిపుణుల సలహాతో ముందుకెళ్తేనే దీర్ఘకాలిక ఆర్థిక భద్రత సాధ్యమవుతుందని వారు సూచిస్తున్నారు.

Advertisement