Delivery partners: జొమాటో, స్విగ్గీ డెలివరీ పార్ట్నర్లకు నెలకు ఎంత ఆదాయం వస్తుందో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
డిసెంబర్ 31 ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు సంవత్సరంలోనే అత్యంత రద్దీగా ఉండే రోజుల్లో ఒకటి. అలాంటి రోజునే దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమన్వయంతో నిరసనలకు పిలుపునిచ్చారు. జీతాల విధానం, ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్స్), సామాజిక భద్రత వంటి అంశాల్లో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ నిరసనలు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. ఎక్కువశాతం డెలివరీ సేవలు ఆ రాత్రంతా యథావిధిగా కొనసాగాయి. అయినప్పటికీ, ఈ స్ట్రైక్ పిలుపులు గిగ్ వర్క్ ఆర్థికతపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి.
Details
ఎక్కువ పనిగంటలు, అధిక ఆర్డర్లతో ఎక్కువ ఆదాయం
డెలివరీ ఉద్యోగులు, ప్లాట్‌ఫారమ్ నిర్వాహకులు, స్టాఫింగ్ సంస్థల ప్రతినిధులతో మనీ కంట్రోల్ నిర్వహించిన చర్చల ప్రకారం ప్రస్తుతం డెలివరీ పని ప్రారంభ స్థాయిలో మంచి నగదు ఆదాయాన్ని అందిస్తోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ ఆదాయం అనేక ఫార్మల్ సెక్టార్ ఉద్యోగాల్లోని ప్రారంభ జీతాలకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగానే ఉందని వారు చెబుతున్నారు. అయితే ఆదాయం పెరగడం మాత్రం ప్రధానంగా ఎక్కువ గంటలు పనిచేయడం, అధిక సంఖ్యలో ఆర్డర్లు పూర్తి చేయడంపై ఆధారపడి ఉంది. డెలివరీ మోడల్‌లో కెరీర్ గ్రోత్ లేదా పైస్థాయికి ఎదిగే అవకాశాలు చాలా పరిమితంగానే ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
Details
డెలివరీ వర్కర్ల ఆదాయం
స్టాఫింగ్ ప్లాట్‌ఫామ్ టీమ్‌లీజ్ సర్వీసెస్ గణాంకాల ప్రకారం, మెట్రో నగరాల్లో పనిచేసే ఫుల్‌టైమ్ డెలివరీ పార్ట్నర్ నెలకు గరిష్టంగా రూ.30,000 వరకు స్థూల ఆదాయం పొందే అవకాశం ఉంది. అయితే ఈ ఆదాయం సంబంధిత ప్లాట్‌ఫామ్, పనిచేసే ప్రాంతం, పని గంటలు, పొందిన ఇన్సెంటివ్స్ వంటి అంశాలపై ఆధారపడి మారుతూ ఉంటుంది.