Page Loader
BharatPe: 'భారత్ పే'కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు.. అష్నీర్ గ్రోవర్‌కు జరిమానా 
BharatPe: 'భారత్ పే'కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు.. అష్నీర్ గ్రోవర్‌కు జరిమానా

BharatPe: 'భారత్ పే'కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు.. అష్నీర్ గ్రోవర్‌కు జరిమానా 

వ్రాసిన వారు Stalin
Nov 28, 2023
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియాలో తరచూ వార్తల్లో నిలిచే భారత్ పే(BharatPe) మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్‌కు దిల్లీ హైకోర్టు షాకిచ్చింది. భారత్ పేకు వ్యతిరేకంగా గ్రోవర్‌ సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో దిల్లీ హైకోర్టు రూ.2లక్షల జరిమానా విధించింది. నవంబర్ 24న దిల్లీ హైకోర్టులో గ్రోవర్‌కు వ్యతిరేకంగా భారత్ పే అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. గ్రోవర్ సోషల్ మీడియాలో కంపెనీకి సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని బహిర్గతం చేసినట్లు అధికారులు పిటిషన్‌లో ఆరోపించారు. రెసిలెంట్ ఇన్నోవేషన్స్ కంపెనీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయకుండా అష్నీర్ గ్రోవర్‌ను నిరోధించాలని అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారించిన హైకోర్టు.. గ్రోవర్‌కు జరిమానా విధించింది. గ్రోవర్‌ కోర్టుకు క్షమాపణ చెప్పినా కూడా జరిమానా విధించడం గమనార్హం.

దిల్లీ

కోర్టు ఆదేశాలను దిక్కరించిన అష్నీర్ గ్రోవర్‌ 

భారత్ పేకు వ్యవతిరేకంగా తాను ఎలాంటి ప్రకటన చేయనని అష్నీర్ గ్రోవర్‌ గతంలో దిల్లీ హైకోర్టుకు చెప్పారు. ఇప్పుడు గ్రోవర్‌ ఆ మాటను తప్పడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి అష్నీర్ గ్రోవర్, భారత్ పే మాతృ సంస్థ రెసిలెంట్ ఇన్నోవేషన్స్ మధ్య కొన్ని నెలలుగా న్యాయపారాటం జరుగుతోంది. ఈ క్రమంలో భారత్ పే కంపెనీ అధికారులపై ఆరోపణలు చేయడం మానుకోవాలని ఈ ఏడాది మేలో అష్నీర్ గ్రోవర్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. దానికి గ్రోవర్‌ కూడా అంగీకరించారు. అయితే కోర్టు ఆదేశాలను దిక్కిరించి, మళ్లీ కంపెనీపై సోషల్ మీడియా వేదికాగా ఆరోపణలు చేయడంతో ధర్మానసం ఆశర్యంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేసింది.