LOADING...
Business Ideas: సొంత ఊరిలోనే నెలకు రూ.2 లక్షల ఆదాయం.. ఈ బిజినెస్ ఐడియా ట్రై చేయండి
సొంత ఊరిలోనే నెలకు రూ.2 లక్షల ఆదాయం.. ఈ బిజినెస్ ఐడియా ట్రై చేయండి

Business Ideas: సొంత ఊరిలోనే నెలకు రూ.2 లక్షల ఆదాయం.. ఈ బిజినెస్ ఐడియా ట్రై చేయండి

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 30, 2026
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగ జీవితానికి విసిగిపోయి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్నవారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో స్వగ్రామంలోనే అధిక లాభాలు పొందేలా రూపొందించిన ఈ బిజినెస్ ఐడియా ప్రస్తుతం మంచి ఆదరణ పొందుతోంది. వివరాల్లోకి వెళ్తే.. నేటి కాలంలో స్వచ్ఛమైన, ఆర్గానిక్ ఆహారానికి డిమాండ్ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో సహజసిద్ధంగా పెరిగే నాటుకోళ్లు, గొర్రెలు, మేకల పెంపకాన్ని వ్యాపారంగా మలచుకోవచ్చు. పట్టణాల్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నవారు, సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు గ్రామీణ రైతులతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు.

వివరాలు

సహజ వాతావరణంలో స్వేచ్ఛగా తిరిగేలా చూడాలి

రైతులకు పెట్టుబడి అందించి, గొర్రె పిల్లలు లేదా నాటుకోళ్లను కొనిచ్చి పెంచే బాధ్యత అప్పగిస్తే, ఇరువురికీ లాభం చేకూరుతుంది. ఈవ్యాపారంలో పశువుల ఆరోగ్యం అత్యంత కీలక అంశం. పశువులు లేదా కోళ్లను ఒకేచోట నిర్బంధించకుండా, సహజ వాతావరణంలో స్వేచ్ఛగా తిరుగుతూ గడ్డి, పురుగులు తినేలా పెంచాలి. సమయానికి టీకాలు వేయించడం, వెటర్నరీ నిపుణుల సూచనలు పాటించడం ద్వారా వ్యాధుల నుంచి రక్షించవచ్చు. దూర ప్రాంతాల్లో ఉండేవారు ఆటోమేషన్ టూల్స్ లేదా సీసీటీవీ కెమెరాల సహాయంతో పర్యవేక్షణ కొనసాగించవచ్చు. అదేవిధంగా ఈ వ్యాపారంలో సీజనల్ డిమాండ్‌ను సరిగ్గా వినియోగించుకోవడం కీలకం. అక్టోబర్ నుంచి మే వరకు దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగలతో పాటు పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో మాంసానికి భారీగా డిమాండ్ ఉంటుంది.

వివరాలు

సరిపడా స్టాక్ సిద్ధం చేసుకోవాలి

ముందస్తుగా ప్రణాళిక వేసుకుని ఈ సమయానికి సరిపడా స్టాక్ సిద్ధం చేస్తే మంచి లాభాలు పొందవచ్చు. మార్కెటింగ్, విక్రయాల విషయంలో కూడా పలు మార్గాలు ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, అపార్ట్‌మెంట్లలో నేరుగా సరఫరా చేయవచ్చు. అలాగే నాటుకోళ్ల మాంసానికి ప్రత్యేకంగా రిటైల్ స్టోర్స్ ప్రారంభించవచ్చు. అదనంగా, వాట్సాప్ గ్రూపులు లేదా చిన్న యాప్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి, నేరుగా వినియోగదారులకు డెలివరీ చేసే విధానాన్ని కూడా అమలు చేయవచ్చు. మొత్తానికి, సరైన ప్రణాళిక, జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాపారం గ్రామీణాభివృద్ధికి తోడ్పడటంతో పాటు పెట్టుబడిదారులకు కూడా మంచి లాభాలను అందించే అవకాశముంది.

Advertisement