Loading...
eBay: ఈబేలో ఉద్యోగాల కోతలు.. 800 మందికి లేఆఫ్‌లు..!
ఈబేలో ఉద్యోగాల కోతలు.. 800 మందికి లేఆఫ్‌లు..!

eBay: ఈబేలో ఉద్యోగాల కోతలు.. 800 మందికి లేఆఫ్‌లు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2026
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఈబేలో మరోసారి ఉద్యోగాల కోతలు చోటుచేసుకున్నాయి. దాదాపు 800 మందిని సంస్థ తొలగిస్తున్నట్లు thelayoff.com వెల్లడించింది. ఇవాళ్టి నుంచే ఈ ప్రక్రియ మొదలైనట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈబే ఉద్యోగుల్లో సుమారు 6 శాతం మందిపై ఈ కోతల ప్రభావం పడే అవకాశముందని చెబుతున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు తమ అనుభవాలను లింక్డ్‌ఇన్‌, బ్లైండ్ వంటి వేదికలలో పంచుకుంటున్నారు. ఈ కోతలు ఏ ఒక్క విభాగానికే పరిమితం కాలేదని తెలుస్తోంది. అమెరికాలోని ఒరెగాన్‌, యుటా, టెక్సాస్‌, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు తమకు నోటీసులు అందినట్లు పేర్కొన్నారు.

వివరాలు 

తక్కువ వ్యయంతో పనిచేసే ప్రాంతాల్లో కార్యకలాపాలను విస్తరించాలనే యోచన

అయితే మొత్తం ఎన్ని పోస్టులు రద్దయ్యాయో, ఏఏ విభాగాలు ప్రభావితమయ్యాయో అనే విషయంపై ఈబే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.

ఇక కొన్ని బాధ్యతలను విదేశాలకు మార్చే ప్రక్రియలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

అమెరికాలో ఉన్న కొన్ని పోస్టులను భారత్‌, ఐర్లాండ్‌లకు మార్చుతున్నట్లు theLayoff ఫోరమ్‌లో పోస్టులు కనిపించాయి.

అయితే దీనిపై కూడా ఈబే నుంచి అధికారిక ధృవీకరణ లేదు.

తక్కువ వ్యయంతో పనిచేసే ప్రాంతాల్లో కార్యకలాపాలను విస్తరించాలనే యోచనలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంచే దిశగా కూడా సంస్థ ముందుకు సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఈబేలో జరుగుతున్న మార్పులు టెక్ రంగంలో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

ADVERTISEMENT