Loading...
X Money: Xలోనే డబ్బుల బదిలీ.. ఎలన్ మస్క్ 'X Money' సేవలకు శ్రీకారం
Xలోనే డబ్బుల బదిలీ.. ఎలన్ మస్క్ 'X Money' సేవలకు శ్రీకారం

X Money: Xలోనే డబ్బుల బదిలీ.. ఎలన్ మస్క్ 'X Money' సేవలకు శ్రీకారం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2026
02:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన X (గతంలో ట్విట్టర్)ను 'ఎవ్రీథింగ్ యాప్'గా తీర్చిదిద్దాలన్న ఎలాన్ మస్క్ లక్ష్యంలో మరో కీలక ముందడుగు పడింది. వినియోగదారులు ఒకరికొకరు తక్షణమే డబ్బు పంపించుకునేలా 'X Money' పేరుతో కొత్త ఆర్థిక సేవలను సంస్థ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సేవను పరిమిత స్థాయిలో, ఆహ్వానం పొందిన ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సోషల్ మీడియా సేవలతో పాటు డిజిటల్ ఆర్థిక సేవల రంగంలోకి X అధికారికంగా ప్రవేశించినట్లైంది.

వివరాలు 

బ్యాంక్ కాదు.. కానీ బ్యాంకింగ్ సేవలు

X Money సాధారణ బ్యాంక్ ఖాతా మాదిరిగానే పలు ఆర్థిక సేవలను అందించినప్పటికీ, ఇది స్వతంత్ర బ్యాంక్ కాదు.

అమెరికాకు చెందిన క్రాస్ రివర్ బ్యాంక్ అందించే బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలపై ఈ సేవ పనిచేస్తుంది.

అయితే వినియోగదారులు ఉపయోగించే అన్ని సేవలు, యాప్ అనుభవం పూర్తిగా X Money బ్రాండ్‌లోనే అందుబాటులో ఉంటాయి.

వివరాలు 

ప్రీమియం సభ్యులకు మాత్రమే అవకాశం

ప్రస్తుతం X Premium సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే ఈ సేవ అందిస్తున్నారు.

అర్హత కలిగిన వినియోగదారులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపించి సేవలో చేర్చుకుంటున్నారు.

సేవలో చేరిన వారికి X బ్రాండ్‌తో కూడిన Visa డెబిట్ కార్డు కూడా అందజేస్తున్నారు.

ఈ కార్డును Visa ఆమోదించే ఏటీఎంలలో నగదు ఉపసంహరణకు, వ్యాపార సంస్థల్లో కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు.

అలాగే ఇతర X వినియోగదారులకు తక్షణమే డబ్బు పంపించే పీర్-టు-పీర్ (P2P) చెల్లింపుల సౌకర్యం కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

6 శాతం వడ్డీ.. 3 శాతం క్యాష్‌బ్యాక్

వినియోగదారులను ఆకర్షించేందుకు X Money పలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.

ఖాతాలో కనీసం 1,000 డాలర్ల బ్యాలెన్స్ కొనసాగిస్తే ఏడాదికి 6 శాతం వడ్డీ అందిస్తామని సంస్థ వెల్లడించింది.

అయితే ఇందుకు X Premium సభ్యత్వం తప్పనిసరి. అదనంగా, డెబిట్ కార్డు ద్వారా చేసే అర్హత కలిగిన కొనుగోళ్లపై 3 శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఇవ్వనుంది.

ఈ ప్రయోజనాల ద్వారా వినియోగదారులు తమ ఆర్థిక లావాదేవీలను X ప్లాట్‌ఫామ్‌లోనే నిర్వహించేలా ప్రోత్సహించాలని కంపెనీ భావిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

మస్క్‌కు కొత్త కాదు డిజిటల్ ఫైనాన్స్

డిజిటల్ చెల్లింపుల రంగం ఎలన్ మస్క్‌కు కొత్తది కాదు. టెస్లా,స్పేస్‌ఎక్స్ సంస్థలను ప్రారంభించే ముందు ఆయన స్థాపించిన X.com సంస్థే తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన PayPalగా రూపాంతరం చెందింది.

అదే అనుభవాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు Xను సోషల్ మీడియాతో పాటు చెల్లింపులు, బ్యాంకింగ్,వాణిజ్య సేవలు అందించే సమగ్ర డిజిటల్ వేదికగా అభివృద్ధి చేయాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

పోటీ మాత్రం తీవ్రంగానే

అయితే X Money ముందు సవాళ్లు కూడా తక్కువగా లేవు. ప్రస్తుతం Venmo, Zelle,Cash App వంటి పీర్-టు-పీర్ చెల్లింపు సేవలకు కోట్లాది మంది వినియోగదారులు ఉన్నారు.

అలాంటి దిగ్గజ సంస్థలతో పోటీ పడుతూ వినియోగదారులను X ఎకోసిస్టమ్‌లోనే నిలబెట్టడం ఎలన్ మస్క్‌కు పెద్ద సవాలుగా మారనుంది.

వివరాలు 

విజయవంతమైతే కొత్త దిశ

సోషల్ మీడియా, డిజిటల్ చెల్లింపులు, అధిక వడ్డీ, క్యాష్‌బ్యాక్ వంటి సేవలను ఒకే వేదికపై అందించడం వల్ల X Money వినియోగదారులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఆహ్వానం ఆధారంగా ప్రారంభమైన ఈ సేవను దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఈ ప్రయోగం విజయవంతమైతే, X కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే కాకుండా డిజిటల్ ఫైనాన్స్ రంగంలోనూ కీలక సంస్థగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT