Page Loader
ట్విట్టర్ యూజర్లకు బ్యాడ్ న్యూస్: పోస్టులు చదవడంపై లిమిట్ విధించిన మస్క్ 
ట్విట్టర్ లో పోస్టులు చదవడంపై లిమిట్ విధించిన ఎలాన్ మస్క్

ట్విట్టర్ యూజర్లకు బ్యాడ్ న్యూస్: పోస్టులు చదవడంపై లిమిట్ విధించిన మస్క్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 02, 2023
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చినప్పటి నుంచి ఈ ప్లాట్ ఫామ్‌లో అనేక రకాల మార్పులు జరుగుతున్నాయి. తాజాగా మరో కొత్త మార్పును మస్క్ శ్రీకారం చుట్టారు. ఇక నుంచి ట్విట్టర్ పోస్టులు చదవడంపై లిమిట్ విధించారు. అంటే ఒక యూజర్ ఎన్ని ట్విట్టర్ పోస్టులు చదవాలో నిర్ణయించారు. వెరిఫైడ్ ప్రొఫైల్స్ ఉన్న యూజర్, ఒకరోజులో 6000ట్విట్టర్ పోస్టులు చదివే అవకాశం ఉంది. అలాగే వెరిఫైడ్ ప్రొఫైల్ లేని ఒక పాత ట్విట్టర్ యూజర్, రోజుకు 600పోస్టులు చదవగలడు. కొత్తగా సైనప్ అయిన ట్విట్టర్ యూజర్, రోజుకు 300పోస్టులు మాత్రమే చదవగలడని మస్క్ పేర్కొన్నారు.

Details

కొత్త రూల్ తీసుకురావడానికి కారణం ఏంటంటే? 

ట్విట్టర్ నుంచి డేటాను దొంగిలించడం, సిస్టమ్‌ను మ్యానిప్యులేట్ చేయడం వంటి ఇబ్బందులను నిరోధించడానికి ఈ కొత్త రకమైన మార్పును తీసుకొచ్చినట్లు ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ పేజీలో చెప్పుకొచ్చారు. ఎలాన్ మస్క్ కొత్తగా తీసుకొచ్చిన ఈ మార్పుపై నెటిజెన్లు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో ఇలాంటి రూల్స్ తీసుకురావడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో మస్క్ తీసుకొచ్చిన కొత్త మార్పు వల్ల జనాలకు మంచి జరుగుతుందని, ట్విట్టర్ వాడకానికి బానిసలైపోయిన వాళ్లు ఈ నిర్ణయం వల్ల ట్విట్టర్‌ని తక్కువగా వాడతారనిసెటైరికల్‌గా ఒక యూజర్ పోస్ట్ పెట్టారు.