
ట్విట్టర్ లోగో నుంచి పక్షి బొమ్మ ఔట్; కొత్త డిజైన్‌పై మస్క్ ఫోకస్
ఈ వార్తాకథనం ఏంటి
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఆదివారం సంచలన ప్రకటన చేసారు. తర్వలోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ బర్డ్ లోగోను తొలగిస్తుందని ప్రకటించారు.
కొన్నేళ్లుగా పక్షి బొమ్మ ట్విట్టర్ బ్రాండ్‌కు నిలువుటద్దంగా మారింది. అలాంటి పక్షి బొమ్మను తొలగిస్తున్నట్లు మస్క్ ప్రకటించడంతో ట్విట్టర్ వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
త్వరలో తాను ట్విట్టర్ బ్రాండ్‌కు, అలాగే పక్షి లోగోకు వీడ్కోలు పలకబోతున్నట్లు మస్క్ ట్వీట్ చేశారు.
ఈరోజు రాత్రి పోస్ట్ చేసే X లోగో అందరికీ నచ్చితే, రేపటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అదే చలామణి అవుతుందని ట్వీట్ చేశారు.
గత సంవత్సరం ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత మస్క్ చేసిన అతిపెద్ద మార్పు ఇదే కావడం గమనార్హం.
ట్విట్టర్
'X' అక్షరం అంటే ఎలాన్ మస్క్‌కు పిచ్చి
కొత్తగా ఏర్పాటైన 'ఎక్స్ కార్ప్' అనే సంస్థలో ట్విట్టర్‌ను విలీనం చేసిన విషయం తెలిసిందే. దీంతో ట్విట్టర్ ఇప్పుడు స్వతంత్ర సంస్థ కాదు.
వాస్తవానికి 'X' అక్షరం అంటే ఎలాన్ మస్క్‌కు పిచ్చి అని చెప్పాలి. అందుకే అతని ప్రతి సంస్థ పేరులో 'X' అనే అక్షరాన్ని ఉండేలా చూసుకుంటారు.
ఏప్రిల్‌లో ట్విట్టర్ సీఈఓగా లిండా యాకారినోను మస్క్‌ను నియమించారు. ఈ క్రమంలో మస్క్ కీలక ప్రకటన చేశారు.
ట్విట్టర్ యాప్‌లో ప్రతి 'X'గా మార్చడానికి లిండా పని చేస్తారని మస్క్ పేర్కొన్నారు. అంటే ట్విట్టర్ యాప్ లోగోను మార్చే ఆలోచన ఎలాన్ మస్క్‌కు ఎప్పటి నుంచి ఉన్నట్లు దీని ద్వారా తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మస్క్ చేసిన ట్వీట్
Like this but X pic.twitter.com/PRLMMA2lYl
— Elon Musk (@elonmusk) July 23, 2023