Page Loader
Elon Musk: డ్రగ్స్‌ ఆరోపణలపై స్పందించిన మస్క్‌ 
Elon Musk: డ్రగ్స్‌ ఆరోపణలపై స్పందించిన మస్క్‌

Elon Musk: డ్రగ్స్‌ ఆరోపణలపై స్పందించిన మస్క్‌ 

వ్రాసిన వారు Stalin
Jan 08, 2024
05:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎల్‌ఎస్‌డీ, కొకైన్, ఎక్స్‌టసీ, కెటామైన్ వంటి చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాలను టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ నిత్యం వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలపై ఎలోన్ మస్క్ తాజాగా స్పందించారు. గత మూడేళ్లుగా తాను మాదకద్రవ్యాల పరీక్షలు చేయించుకుంటున్నట్లు మస్క్ వెల్లడించారు. కానీ తన శరీరంలో డ్రగ్స్, ఆల్కహాల్‌కు సంబంధించిన ఆనవాళ్లు కనపడలేదని పేర్కొన్నాడు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు మస్క్ పార్టీల్లో చట్టవిరుద్ధమైన డ్రగ్స్ తీసుకుంటాడని వాల్ స్ట్రీట్ జర్నల్ ఇటీవల రాసుకొచ్చిది. అంతేకాదు, మస్క్ అతని మాదకద్రవ్యాల వినియోగం అనేది టెస్లా, స్పేస్‌ఎక్స్ బోర్డు సభ్యుల్లో ఆందోళన కలిగించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది.

మస్క్

నాసా అభ్యర్థన మేరకు మూడేళ్లుగా పరీక్షలు చేయించుకుంటున్న: మస్క్

వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికను ప్రస్తావిస్తూ మస్క్ ట్వీట్ చేశారు. తాను గతంలో రోగన్‌తో ఒక పఫ్ డ్రగ్స్ తీసుకున్నట్లు మస్క్ ఒప్పుకున్నారు. అయితే ఆ తర్వాత నాసా అభ్యర్థన మేరకు గత మూడేళ్లుగా డ్రగ్స్ నిర్దారణ పరీక్షలు చేయించుకుంటున్నట్లు వెల్లడించారు. 2018లో రోగన్‌తో నిర్వహించిన పోడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో మస్క్ గంజాయిని తాగాడు. SpaceX అధినేతగా మస్క్ ఉన్నందున డ్రగ్స్ తీసుకోవడంపై నాసా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా చేయడం కంపెనీ ఫెడరల్ డ్రగ్-ఫ్రీ వర్క్‌ప్లేస్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని నాసా చెప్పింది. ఈ క్రమంలో SpaceX సంస్థ డ్రగ్-ఫ్రీ వర్క్‌ప్లేస్ చట్టాన్ని పాటిస్తున్నట్లు మస్క్ నుంచి అప్పట్లో రాతపూర్వక హామీని కోరింది. దీంతో మస్క్ వెంటనే నాసాకు హామీ ఇచ్చారు.