Threads: 100 మిలియన్ యూజర్ల మార్క్‌ను దాటిన థ్రెడ్స్ యాప్
ఈ వార్తాకథనం ఏంటి
ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా తీసుకొచ్చిన థ్రెడ్స్ యాప్ అనతికాలంలోనే వినియోగదారులకు చేరువ అవుతోంది.
ట్విట్టర్‌కు పోటీగా తీసుకొచ్చిన థ్రెడ్స్ యాప్ సోమవారం మధ్యాహ్నం 12:30గంటల సమయానికి థ్రెడ్ యాప్ వినియోగదారుల సంఖ్య 100 మిలియన్ల మార్కును దాటింది.
జులై 6వ తేదీన మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ థ్రెడ్స్ యాప్‌ను లాంచ్ చేశారు. వారం రోజులు కూడా గడవక ముందే ఈ యాప్ ఏకంగా 100 మిలియన్ల యూజర్లను ఆకర్షించింది.
థ్రెడ్స్ యాప్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కొన్ని రోజుల్లో భారీగా వినియోగదారులను ఆకర్షించగలిగింది. థ్రెడ్స్ యాప్ చాలా వేగంగా వృద్ధి రేటును సాధించింది.
అయితే ఇన్‌స్టాకు థ్రెడ్స్ యాప్‌ను అనుసంధానం చేసిన చేయడం కూడా ఈ వృద్ధికి కారణంగా కనిపిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వారంలో రికార్డు సృష్టించిన థ్రెడ్స్ యాప్
Threads App Gains 100 Million Users in Under a Week, Elon Musk's Twitter Reportedly Sees Traffic Drop
— 2YoDoINDIA News Network (@2yodoindia) July 10, 2023
For more news visit https://t.co/98KV4yIruC#2YoDoINDIA #Threads #ThreadsApp #Instagram #Twitter #Meta #ElonMusk pic.twitter.com/j9ckWeOfnf
ట్విట్టర్
తగ్గుతున్న ట్విట్టర్ ట్రాఫిక్
థ్రెడ్స్ కొత్త వినియోగదారులకు చేరువ అవుతుంటే, ట్విట్టర్ ట్రాఫిక్ క్రమంగా తగ్గుతోంది.
థ్రెడ్స్ యాప్ వేగంగా పుంజుకోవడం అనేది ట్విట్టర్‌లో కొంత గందరగోళానికి కారణమైంది.
వాణిజ్య రహస్యాల దొంగతనంపై ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటాపై దావా వేస్తానని ట్విట్టర్ బాస్ మస్క్ ఇటీవల బెదిరించిన విషయం తెలిసిందే.
అంతేకాదు, ట్విట్టర్ నుంచి తొలగించిన ఉద్యోగులకు థ్రెడ్ యాప్ బాధ్యతను మార్క్ జుకర్‌బర్గ్ అప్పగించినట్లు మస్క్ పేర్కొన్నారు.