LOADING...
Elon Musk: ఎలాన్‌ మస్క్‌ సెన్సేషన్‌.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా రికార్డు
ఎలాన్‌ మస్క్‌ సెన్సేషన్‌.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా రికార్డు

Elon Musk: ఎలాన్‌ మస్క్‌ సెన్సేషన్‌.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 24, 2026
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరుపొందిన ఎలాన్ మస్క్‌కు సంబంధించిన కంపెనీ స్పేస్ ఎస్ ఇప్పుడు పబ్లిక్ ఇష్యూ (IPO)కు వెళ్లబోతున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. వాల్‌స్ట్రీట్‌ చరిత్రలోనే ఇది ఇప్పటివరకు అతిపెద్ద ఐపీఓగా నిలుస్తుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఐపీఓతో మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా (లక్ష కోట్ల డాలర్ల అధిపతిగా) మారే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

వివరాలు

షేర్లు, ఆప్షన్ల వివరాలు

ఐపీఓ ముసాయిదా ప్రకారం, ఎలాన్‌ మస్క్‌కు స్పేస్‌ఎక్స్‌లో సుమారు 510 కోట్ల షేర్లు ఉన్నాయి. వీటికి అదనంగా ఒక్కోటీ 8.39 డాలర్ల విలువ కలిగిన 35 కోట్ల స్టాక్‌ ఆప్షన్లు కూడా ఆయన వద్ద ఉన్నాయని సమాచారం. ఒకవేళ స్పేస్‌ఎక్స్ ఐపీఓ సమయంలో కంపెనీ మార్కెట్ విలువ 2 లక్షల కోట్ల (2 ట్రిలియన్‌) డాలర్లకు చేరుకుంటే, మస్క్ నికర సంపద సుమారు 1.1 లక్షల కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉంది. అదే కంపెనీ విలువ 1.75 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో నమోదైతే, మస్క్‌కు టెస్లా సహా ఇతర పెట్టుబడులతో కలిపి సంపద లక్ష కోట్ల డాలర్లను సులభంగా అధిగమించవచ్చని అంచనా.

వివరాలు

కంపెనీలో కొత్త బిలియనీర్లు

గత ఏడాదే 500 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.48 లక్షల కోట్లు) సంపదతో తొలిసారిగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డు సృష్టించిన మస్క్, ఈ IPOతో తన సంపదను మరింత పెంచుకునే అవకాశం ఉంది. ఇంకా అంచనాల ప్రకారం, స్పేస్‌ఎక్స్ మార్కెట్ విలువ 7.5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటే మస్క్‌కు పనితీరు ఆధారితంగా 100 కోట్ల రిస్ట్రిక్టెడ్ షేర్లు లభించనున్నాయి. అయితే ఇందుకు షరతుగా అంగారక గ్రహంలో కనీసం 10 లక్షల మంది నివసించే శాశ్వత మానవ కాలనీ ఏర్పాటుచేయాల్సి ఉంటుంది.

Advertisement

వివరాలు

బిలియనీర్ల జాబితాలో కొత్త పేర్లు

మరో ప్యాకేజీ ప్రకారం, కంపెనీ విలువ 6.6 లక్షల కోట్ల డాలర్లకు చేరి, భూమికి బయట గ్రహాల్లో 100 టెరావాట్‌ వార్షిక సామర్థ్యంతో డేటా సెంటర్ల ఏర్పాటు సాధ్యమైతే, మస్క్‌కు అదనంగా 30 కోట్ల రిస్ట్రిక్టెడ్ షేర్లు లభించనున్నాయి. ఈ ఐపీఓ విజయవంతమైతే స్పేస్‌ఎక్స్‌లోనే పలువురు కొత్త బిలియనీర్లు కూడా పుట్టుకొచ్చే అవకాశం ఉంది. కంపెనీ ప్రెసిడెంట్ గ్విన్నె షాట్‌వెల్, సీఎఫ్‌ఓ బ్రెట్ జాన్సన్, అలాగే బోర్డు డైరెక్టర్ ల్యూక్ నోసెక్ వంటి కీలక వ్యక్తులు కంపెనీ లక్ష్యిత మార్కెట్ విలువ చేరితే బిలియనీర్ల జాబితాలో చేరనున్నారని అంచనా వేస్తున్నారు.

Advertisement