Elon Musk: ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందిన ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా నిలిచే అవకాశానికి ఆయన చాలా దగ్గరలో ఉన్నారని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ ఏడాదిలోనే ఆయన ఆ ఘనత సాధించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 800 బిలియన్ డాలర్ల సంపదను అధిగమించిన తొలి వ్యక్తిగా మస్క్ రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆయన మొత్తం నికర విలువ సుమారు 850 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడుతోంది.
వివరాలు
స్పేస్-X ,ఎక్స్‌ఏఐ మధ్య ఇటీవల కుదిరిన కీలక ఒప్పందం
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్న గూగుల్ సహవ్యవస్థాపకులు లారీ పేజ్ (251 బిలియన్ డాలర్లు), సెర్గీ బ్రిన్ (231 బిలియన్ డాలర్లు), మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (219 బిలియన్ డాలర్లు).. ఈ ముగ్గురి సంపదను కలిపిన దానికన్నా కూడా మస్క్ ఆస్తి ఎక్కువగా ఉండటం విశేషం. ట్రిలియన్ డాలర్ల మార్క్ వైపు ఆయన సంపద వేగంగా దూసుకుపోవడానికి ప్రధాన కారణంగా స్పేస్-X ,ఎక్స్‌ఏఐ మధ్య ఇటీవల కుదిరిన కీలక ఒప్పందం మారింది. కృత్రిమ మేధస్సు,సోషల్ మీడియా రంగంలో పనిచేస్తున్నఎక్స్‌ఏఐ సంస్థను గత వారం స్పేస్‌ఎక్స్ సుమారు 1.25 ట్రిలియన్ డాలర్ల విలువతో కొనుగోలు చేసింది.
వివరాలు
టెస్లా కంపెనీలో కూడా మస్క్‌కు 12 శాతం వాటా
ఈ విలీన సంస్థలో ఎలాన్ మస్క్‌కు 43 శాతం వాటా ఉండగా, ఆ ఒక్క వాటా విలువే సుమారు 530 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో, టెస్లా కంపెనీలో కూడా మస్క్‌కు 12 శాతం వాటా ఉంది. ఆ వాటా విలువ ప్రస్తుతం దాదాపు 178 బిలియన్ డాలర్లుగా లెక్కించబడుతోంది. ఈ నేపథ్యంలో, ఈ ఏడాదిలోనే ఆయన బిలియనీర్ స్థాయి నుంచి ట్రిలియనీర్‌గా మారే అవకాశం సుమారు 75 శాతం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
వివరాలు
ఎలాన్ మస్క్ మొత్తం నికర విలువ 1.5 ట్రిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం
ఇక ముందుచూపులో భాగంగా, ఈ ఏడాది స్పేస్‌ఎక్స్ ఐపీఓకు రానున్నట్లు సమాచారం. ప్రతిపాదిత ఐపీఓ ద్వారా కంపెనీ సుమారు 25 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2.26 లక్షల కోట్లు) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళికలన్నీ అనుకున్నట్టుగా అమలైతే, ఎలాన్ మస్క్ మొత్తం నికర విలువ 1.5 ట్రిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశముందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.