LOADING...
Car Insurance: ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రాదా? ఈ తప్పులు చెక్ చేసుకోండి!
ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రాదా? ఈ తప్పులు చెక్ చేసుకోండి!

Car Insurance: ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రాదా? ఈ తప్పులు చెక్ చేసుకోండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 20, 2026
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

చాలామంది వాహనదారులు కొత్తగా బండి కొనుగోలు చేసినప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఆ తర్వాత ప్రతేడాది దాన్ని రిన్యూవ్ చేస్తూ ఉంటారు. కానీ పాలసీ వివరాలను సరిగ్గా పరిశీలించడం మాత్రం మరిచిపోతారు. అది మెయిల్ బాక్స్‌లోనో, కారు డాష్‌బోర్డ్‌లోనో అలా ఉండిపోతుంది. అయితే అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు లేదా వర్షాల వల్ల కారు నీటిలో మునిగిపోయినప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ గురించి గుర్తొస్తుంది. క్లెయిమ్ పెట్టినప్పుడు ఇది కవర్ కాదు, పూర్తి మొత్తం రాదని కంపెనీ చెబితే గందరగోళం మొదలవుతుంది. చాలా మంది కంపెనీ మోసం చేస్తోందని భావిస్తారు. కానీ అసలు కారణం పాలసీ తీసుకునేటప్పుడు అందులోని నిబంధనలు అర్థం చేసుకోకపోవడమే.

వివరాలు

క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది?

కవర్ ష్యూర్ (CoverSure) సీఈఓ సౌరభ్ విజయవర్గియా ప్రకారం, 10 కేసుల్లో 9 క్లెయిమ్ రిజెక్షన్లు మనం జాగ్రత్తగా ఉంటే నివారించవచ్చు. చాలా మంది పాలసీ రిన్యూవల్ తేదీ మరిచిపోతారు. గడువు ముగిసిన తర్వాత ప్రమాదం జరిగితే ఒక్క రూపాయి కూడా రాదు. అలాగే ప్రమాద సమయంలో డ్రైవర్ వద్ద చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, గడువు ముగిసిపోయినా క్లెయిమ్ తిరస్కరించబడుతుంది. కారులో సిఎన్‌జి (CNG) కిట్ అమర్చినా, ఖరీదైన మ్యూజిక్ సిస్టమ్, అలాయ్ వీల్స్ వంటి మార్పులు చేసినా వాటిని ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. చెప్పకుండా క్లెయిమ్ వేస్తే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

వివరాలు

డిప్రిసియేషన్ వల్ల నష్టం

చాలాసార్లు క్లెయిమ్ పూర్తిగా తిరస్కరించబడదు కానీ మనం ఖర్చు చేసిన మొత్తం రావడం లేదు. దీనికి కారణం 'డిప్రిసియేషన్'. వాహనం పాతబడే కొద్దీ దాని విడిభాగాల విలువ తగ్గుతుంది. ఉదాహరణకు, బంపర్ మార్చాల్సి వస్తే, దాని అసలు ధరలో 50% మాత్రమే కంపెనీ చెల్లిస్తుంది. మిగిలినది మనమే భరించాలి. 'కాంప్రహెన్సివ్' అంటే అన్నీ కవర్ అవుతాయని కాదు చాలామంది కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకుంటే అన్ని రకాల నష్టాలు కవర్ అవుతాయని అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. వర్షాల్లో నీటిలో కారు నడిపి ఇంజిన్‌లో నీళ్లు చేరితే (హైడ్రోస్టాటిక్ లాక్), సాధారణ పాలసీలో దానికి కవర్ ఉండదు. కారు నిలిపివుంచిన చోట నీరు ముంచితే బాడీ డ్యామేజ్‌కు మాత్రమే కవరేజ్ ఉంటుంది.

Advertisement

వివరాలు

మీ క్లెయిమ్‌ను కాపాడే యాడ్-ఆన్స్

కొంచెం అదనపు ప్రీమియం చెల్లిస్తే కొన్ని యాడ్-ఆన్స్ తీసుకోవచ్చు. జీరో డిప్రిసియేషన్ : ప్లాస్టిక్ లేదా ఫైబర్ పార్ట్స్ మార్చినా పూర్తి మొత్తం కంపెనీ చెల్లిస్తుంది. ఇంజిన్ ప్రొటెక్షన్ : భారీ వర్షాలు ఉండే ప్రాంతాల్లో ఇది చాలా ఉపయోగకరం. ఇంజిన్ రిపేర్ ఖర్చులను కవర్ చేస్తుంది. యాక్సిడెంట్ తర్వాత చేసే తప్పులు ప్రమాదం జరిగిన వెంటనే బండిని రిపేర్ చేయించడం పెద్ద తప్పు. ఇన్సూరెన్స్ కంపెనీ పరిశీలించే ముందు రిపేర్ చేస్తే క్లెయిమ్ నిలిపివేయవచ్చు. ప్రమాద స్థలంలో ఫోటోలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇవి సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి.

Advertisement

వివరాలు

క్లెయిమ్ రిజెక్ట్ అయితే ఏమి చేయాలి?

క్లెయిమ్ తిరస్కరించబడితే అది చివరి నిర్ణయం కాదు. ముందుగా కంపెనీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. అక్కడ పరిష్కారం లభించకపోతే IRDAI వద్ద ఫిర్యాదు చేయవచ్చు. చివరగా 'ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్'ను ఆశ్రయించవచ్చు. వీరు ఉచితంగా కేసును విచారించి, రూ.50 లక్షల వరకు వివాదాలను పరిష్కరిస్తారు. మొత్తంగా, ఇన్సూరెన్స్ కంపెనీలు రక్షణ కోసం ఉన్నప్పటికీ, పాలసీ నిబంధనలు అర్థం చేసుకోకపోతే నష్టపోయేది మనమే. అందుకే తక్కువ ప్రీమియం చూసే బదులు, సరైన కవరేజ్ ఉన్న పాలసీని ఎంపిక చేయడం అత్యంత ముఖ్యం.

Advertisement