IPO: 5 కంపెనీలు.. రూ.7,400 కోట్లు.. ఈ వారం ఐపీఓల సందడి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రైమరీ మార్కెట్‌లో ఈ వారం కూడా ఐపీఓల సందడి కొనసాగనుంది. మొత్తం ఐదు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.7,400 కోట్లను సమీకరించేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో ఆటో విడిభాగాల తయారీ సంస్థ ధూత్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు మోల్బియో డయాగ్నొస్టిక్స్, మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్, షిప్‌రాకెట్, బెహారీలాల్ ఇంజినీరింగ్ కంపెనీలు ఉన్నాయి. ఆటో మొబైల్ విడిభాగాల తయారీ సంస్థ ధూత్ ట్రాన్స్‌మిషన్ ఐపీఓ ద్వారా రూ.3,067 కోట్లు సమీకరించనుంది. ఒక్కో షేరుకు రూ.829 నుంచి రూ.871 వరకు ధరల శ్రేణిని నిర్ణయించింది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.1,400 కోట్లు సమీకరించనుండగా ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు 1.91 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఐపీఓకు ఆగస్టు 10 నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానుంది.
వివరాలు
ఆగస్టు 11న ప్రారంభం..
టెమాసెక్, మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేట్ ఈక్విటీ మద్దతు ఉన్న మోల్బియో డయాగ్నొస్టిక్స్ కూడా ఐపీఓకు రానుంది.
ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.904-940 కోట్లు సమీకరించనుంది. ఒక్కో షేరుకు రూ.768-807 ధరల శ్రేణిని నిర్ణయించింది.
ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.200 కోట్లు సమీకరించనుండగా.. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 91.66 లక్షల షేర్లను విక్రయించనున్నారు.
ఈ ఐపీఓకు కూడా ఆగస్టు 10 నుంచే సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమవుతుంది.
మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్ ఐపీఓ ఆగస్టు 11న ప్రారంభం కానుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,553 కోట్లు సమీకరించనుంది.
వివరాలు
ఒక్కో షేరుకు రూ.133-140 ధరల శ్రేణి..
ఒక్కో షేరుకు రూ.133-140 ధరల శ్రేణిని నిర్ణయించింది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.1,428 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మరో రూ.125 కోట్లు సమీకరించనుంది.
ఒక డెయిరీ కంపెనీ ఈ స్థాయిలో నిధులు సమీకరించడం ఇదే తొలిసారి. లాజిస్టిక్స్ సంస్థ షిప్‌రాకెట్ కూడా ఐపీఓకు సిద్ధమైంది.
పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,617.5 కోట్లు సమీకరించనుంది. ఒక్కో షేరుకు రూ.92-97 ధరల శ్రేణిని నిర్ణయించింది.
ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.885.50 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.732 కోట్లు సమీకరించనుంది.
షిప్‌రాకెట్ ఐపీఓకు ఆగస్టు 12న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమవుతుంది.