Loading...
Kalyan Krishnamurthy: ఫ్లిప్‌కార్ట్ సీఈఓ పదవికి కల్యాణ్ కృష్ణమూర్తి గుడ్‌బై?  
ఫ్లిప్‌కార్ట్ సీఈఓ పదవికి కల్యాణ్ కృష్ణమూర్తి గుడ్‌బై?

Kalyan Krishnamurthy: ఫ్లిప్‌కార్ట్ సీఈఓ పదవికి కల్యాణ్ కృష్ణమూర్తి గుడ్‌బై?  

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కీలక మార్పు చోటుచేసుకోనుంది. సంస్థ గ్రూప్ సీఈఓగా గత పదేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న కల్యాణ్ కృష్ణమూర్తి త్వరలో తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. రానున్న కొన్ని వారాల్లో ఆయన వైదొలగనున్నారని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులు వెల్లడించారు. భారత ఈ-కామర్స్ రంగంలో ప్రముఖ సంస్థగా ఎదిగిన ఫ్లిప్‌కార్ట్‌కు ఇది కీలక పరిణామంగా మారనుంది. తీవ్ర పోటీ, వ్యాపార వ్యూహాల్లో మార్పులు, వినియోగదారుల అభిరుచుల్లో చోటుచేసుకున్న మార్పుల మధ్య ఆయన సంస్థను ముందుకు నడిపించారు.

వివరాలు 

ఫ్లిప్‌కార్ట్‌లో కీలక పాత్ర పోషించిన కల్యాణ్

కల్యాణ్ కృష్ణమూర్తి పదవి నుంచి తప్పుకోనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ బుధవారం మధ్యాహ్నం అత్యవసర టౌన్‌హాల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మనీకంట్రోల్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు వెల్లడించారు.

అయితే ఈ వార్తలపై సంస్థ అధికార ప్రతినిధి స్పందించలేదు.ఈమెయిల్,వాట్సాప్ ద్వారా పంపిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదు.

సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ కలిసి ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించారు.

అయితే వాల్‌మార్ట్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసిన తర్వాత వ్యవస్థాపకులు వైదొలగడంతో కల్యాణ్ కృష్ణమూర్తి బాధ్యతలు చేపట్టారు.

అప్పటి నుంచి దాదాపు పదేళ్లపాటు సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

అమెజాన్ వంటి బలమైన ప్రత్యర్థితో పాటు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన మీషో నుంచి ఎదురైన పోటీని సమర్థంగా ఎదుర్కొంటూ సంస్థ కార్యకలాపాలను బలోపేతం చేశారు.

వివరాలు 

కొత్త వ్యాపార విభాగాలపై దృష్టి

గతంలో ఆయన ఫ్లిప్‌కార్ట్‌కు తొలి దశలో పెట్టుబడులు పెట్టిన టైగర్ గ్లోబల్ సంస్థలో పనిచేశారు.

స్నేహితులు, సహచరులు ఆయనను ముద్దుగా కేకే అని పిలుస్తుంటారు. వాల్‌మార్ట్ యాజమాన్యంలో ఫ్లిప్‌కార్ట్ రూపురేఖలు మారడంలో ఆయనది కీలక పాత్ర.

వేగంగా నిర్ణయాలు తీసుకోవడం,వాటిని అమలు చేయడంలో పట్టుదలతో వ్యవహరించడం కల్యాణ్ కృష్ణమూర్తి ప్రత్యేకతగా గుర్తింపు పొందింది. సంస్థను వ్యవస్థాపకుడి తరహాలో నడిపించే విధానాన్ని ఆయన అనుసరించేవారు.

ముఖ్యంగా ఆహార డెలివరీ వంటి కొత్త వ్యాపార విభాగాల్లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

జెన్‌జీ (Gen Z) వినియోగదారులను ఆకర్షించేలా కొత్త ఉత్పత్తులు, సేవలను విస్తరించడంపై కూడా దృష్టి పెట్టారు.

ADVERTISEMENT

వివరాలు 

ఫ్లిప్‌కార్ట్‌లో అంతర్గత అసంతృప్తి

మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన క్విక్ కామర్స్ సేవ 'మినిట్స్'ను మరింత బలోపేతం చేస్తున్నారు.

ఈ విభాగంలో అమెజాన్, ఎటర్నల్‌కు చెందిన బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో సంస్థలతో ఫ్లిప్‌కార్ట్ పోటీపడుతోంది.

ఇటీవలి కాలంలో ఫ్లిప్‌కార్ట్ పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. కంపెనీ ఐపీఓ (IPO) వాయిదా, నిధుల సమీకరణ ప్రయత్నాలు, కీలక ఉద్యోగుల రాజీనామాలు సంస్థలో చర్చనీయాంశంగా మారాయి.

ఉద్యోగుల పనితీరు, ఉత్సాహంపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. కల్యాణ్ కృష్ణమూర్తి వైదొలగడానికి తక్షణ కారణాలు ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

అయితే సంస్థలో అంతర్గతంగా, వ్యాపారపరంగా పలు సమస్యలు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ADVERTISEMENT

వివరాలు 

ఫ్లిప్‌కార్ట్‌లో అంతర్గత అసంతృప్తి

ఫ్లిప్‌కార్ట్ ఐపీఓ ఎప్పుడు వస్తుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో లాభదాయకతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్న వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్‌పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని మనీకంట్రోల్ గతంలోనే వెల్లడించింది.

దీంతో ప్రస్తుతం, గతంలో పనిచేసిన ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగినట్లు సమాచారం.

కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టయితే తమ ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ల (ESOPs) ద్వారా ప్రయోజనం పొందవచ్చని చాలామంది ఆశించారు.

ఐపీఓపై అనిశ్చితి కొనసాగుతుండటంతో వారి ఆశలు నెరవేరడం లేదు.

వివరాలు 

ఏడాదిలో 14 మంది కీలక ఉద్యోగుల నిష్క్రమణ

ఐపీఓపై స్పష్టత లేకపోవడంతో పాటు సంస్థలో సీనియర్ స్థాయి ఉద్యోగులు వరుసగా వైదొలగడం కూడా ఫ్లిప్‌కార్ట్‌కు సవాలుగా మారింది.

గత ఏడాది కాలంలో కనీసం 14 మంది వైస్ ప్రెసిడెంట్లు (VP), సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు (SVP) సంస్థను వీడినట్లు మనీకంట్రోల్ గతంలో వెల్లడించింది.

వీరిలో పలువురు కీలక విభాగాల్లో బాధ్యతలు నిర్వహించినవారే కావడం గమనార్హం.

మరోవైపు, గత నెలలో ఫ్లిప్‌కార్ట్‌లో గతంలో పనిచేసిన కనీసం 1,000 మంది ఉద్యోగులు వాల్‌మార్ట్ బోర్డుకు లేఖ రాశారు.

కంపెనీ షేర్లను తిరిగి కొనుగోలు చేసే సమయంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు, గతంలో పనిచేసిన ఉద్యోగులకు సమానమైన నిబంధనలు వర్తింపజేయాలని కోరారు.

వివరాలు 

2017లో సీఈఓగా బాధ్యతలు

తమ వద్ద ఉన్న షేర్ల ద్వారా లభించే ప్రయోజనాల విషయంలో వివక్ష ఉండకూడదన్నది వారి ప్రధాన డిమాండ్. ఈ అంశం సంస్థ మాజీ ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిబింబిస్తోంది.

కల్యాణ్ కృష్ణమూర్తి 2017 జనవరిలో ఫ్లిప్‌కార్ట్ సీఈఓగా నియమితులయ్యారు.

2018 నుంచి ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు 2013లో ఇదే సంస్థలో తాత్కాలిక చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా పనిచేశారు.

ఆ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉన్న టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

ఇప్పుడు ఆయన వైదొలగనున్నారన్న వార్తలు సంస్థ భవిష్యత్ నాయకత్వంపై ఆసక్తిని పెంచుతున్నాయి.

ADVERTISEMENT