ఉద్యోగుల తొలగింపులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఫ్లిప్ కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్
ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ కృష్ణ రాఘవన్ ప్రకారం,ఫ్లిప్ కార్ట్ పెద్దమొత్తంలో నియామకాన్నిచేపట్టదు, ఎందుకంటే దానివలన ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగ కోతలు చేయాల్సి వస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలలో కొనసాగుతున్న తొలగింపుల మధ్య ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులకు భారీ ఉపశమనం కలిగించే ఒక ప్రకటనలో, స్వదేశీ ఈ -కామర్స్ ఉద్యోగ తొలగింపులు చేసే ఉద్దేశం లేదని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ (CPO) తెలిపారు. మేము బాధ్యతాయుతమైన నియామకం చేస్తాము, మేము ఎప్పుడూ వేలాది మందిని నియమించుకోమని, పరిమిత సంఖ్యలో అవసరమైన మేరకే నియమించుకుంటామని రాఘవన్ వ్యాఖ్యానించారు.
సీనియర్ మేనేజ్‌మెంట్‌కు ఈ సంవత్సరం జీతాల పెంపు లేదు
కంపెనీ ఈమధ్యే సీనియర్ మేనేజ్‌మెంట్‌కు జీతాల పెంపును ఇవ్వకూడదని తీసుకున్న నిర్ణయం వల్ల ఉద్యోగాల కోత ఉండదని, గత సంవత్సరం పెంపుదల, పదోన్నతులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఫ్లిప్ కార్ట్ స్టాండ్ దాని ప్రధమ పోటీదారు అమెజాన్ కి పూర్తి విరుద్ధంగా ఉంది, ఇక్కడ జనవరి నుండి ఇప్పటికే 27,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించారు. జూన్‌లో చేరే ఫ్రెషర్‌లను ఆన్‌బోర్డ్ చేయడంలో 'ఆలస్యం' ఏమీ లేదని రాఘవన్ అన్నారు. సాధారణంగా వర్క్‌ఫ్లోలను ప్రణాళిక ప్రకారం రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు.