Page Loader
ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు లభిస్తున్న Dell G15 గేమింగ్ ల్యాప్‌టాప్
Dell G15 ఫ్లిప్ కార్ట్ లో రూ.92,990కే అందుబాటులో ఉంది

ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు లభిస్తున్న Dell G15 గేమింగ్ ల్యాప్‌టాప్

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 04, 2023
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

Dell G15 గేమింగ్ ల్యాప్‌టాప్ దాని హై-ఎండ్ CPU,GPU వీడియో ఎడిటింగ్, 3D రెండరింగ్ వంటి ఫీచర్స్ తో గేమ్ర్స్ ను ఆకర్షిస్తుంది. ఇందులో ఎక్కువసేపు పని చేసినా థ్రోట్లింగ్ లేదా వేడెక్కడం, శబ్దం రావడం లాంటివి ఉండదు. ఫ్లిప్ కార్ట్ లో, Dell G15 (G15-5515) ధర రూ. 1,21,935. అయితే రిటైల్‌గా రూ.28,945 తగ్గింపుతో రూ. 92,990కే అందుబాటులో ఉంది. అదనంగా, కొనుగోలుదారులు DBS బ్యాంక్ కార్డ్‌లపై రూ.750 తగ్గింపు పాత ఫోన్ ఎక్స్ఛేంజి అయితే రూ.12,300 తగ్గింపుతో వస్తుంది. బజాజ్ ఫిన్‌సర్వ్ కార్డ్‌లను ఉపయోగించి మూడు నెలల వరకు నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది.

ల్యాప్ టాప్

ఒక్కో ఛార్జ్‌కి 10 గంటల బ్యాకప్‌ ఇస్తుంది

Dell G15 Alienware- థర్మల్ డిజైన్‌ తో వస్తుంది, గేమ్ షిఫ్ట్ కీతో ఉన్న ఆరెంజ్ బ్యాక్‌లిట్ కీబోర్డ్, పెద్ద ట్రాక్‌ప్యాడ్, HD వెబ్‌క్యామ్‌ తో వస్తుంది. ల్యాప్‌టాప్ బూడిద రంగులో, 2.57 కిలోల బరువు ఉంటుంది. ఇది Wi-Fi 6, బ్లూటూత్ 5.1కి సపోర్ట్ చేస్తుంది. Dell G15లో AMD Ryzen 7-5800H సిరీస్ ప్రాసెసర్‌ ఉంది, 4GB NVIDIA GeForce RTX 3050 గ్రాఫిక్స్ కార్డ్, 16GB DDR4 RAM, 512GB స్టోరేజ్ ఉంది. ఒక్కో ఛార్జ్‌కి గరిష్టంగా 10 గంటల బ్యాకప్‌తో 56Wh బ్యాటరీతో వస్తుంది. ఇది ముందే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్, స్టూడెంట్ 2021 ప్యాకేజీతో ఇన్‌స్టాల్ అయ్యి ఉంది.