LOADING...
Dark patterns: డార్క్ ప్యాటర్న్స్‌పై ప్రభుత్వ కఠిన నిఘా… 26 ఈ -కామర్స్‌ సంస్థల స్వీయ ధ్రువీకరణ
26 ఈ -కామర్స్‌ సంస్థల స్వీయ ధ్రువీకరణ

Dark patterns: డార్క్ ప్యాటర్న్స్‌పై ప్రభుత్వ కఠిన నిఘా… 26 ఈ -కామర్స్‌ సంస్థల స్వీయ ధ్రువీకరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 26 ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలు తమ ఆన్‌లైన్ ప్లాట్‍ఫారమ్‌లలో డార్క్ ప్యాటర్న్స్ ఏవీ లేవని స్వచ్ఛందంగా ప్రకటించాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జప్టో, జొమాటో, స్విగ్గీ, జియోమార్ట్, బిగ్‌బాస్కెట్ వంటి ప్రసిద్ధ సేవలు కూడా ఈ జాబితాలో ఉన్నాయని తెలిపింది. వినియోగదారుల హక్కులను రక్షించే దిశగా డిజిటల్ మార్కెట్‌లో తీసుకున్న ప్రధాన అడుగుగా దీనిని వినియోగదారుల వ్యవహారాల శాఖ అభివర్ణించింది. 'డార్క్ ప్యాటర్న్స్ ప్రివెన్షన్ అండ్ రెగ్యులేషన్ గైడ్‌లైన్స్-2023'కు తమ ప్లాట్‌ఫారమ్‌లు పూర్తిగా అనుగుణంగా ఉన్నాయని ఈ సంస్థలు స్వీయ ధృవీకరణ పత్రాలు సమర్పించాయి.

వివరాలు 

మోసపూరిత ఆన్‌లైన్‌ డిజైన్‌ పద్ధతులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు

ఆన్‌లైన్‌లో వినియోగదారులను గందరగోళానికి గురి చేసే లేదా మోసగించే డిజైన్ పద్ధతులు నిలువరించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పలు కంపెనీలు తమ అంతర్గత బృందాల ద్వారా లేదా బాహ్య ఆడిటింగ్ సంస్థల సహాయంతో తనిఖీలు నిర్వహించి, డార్క్ ప్యాటర్న్స్‌ను గుర్తించి తొలగించాయి. డార్క్ ప్యాటర్న్స్ తమ వెబ్‌సైట్‌లు, యాప్‌లలో లేవని మొత్తం 26 కంపెనీలు అధికారికంగా ప్రకటించాయని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) వెల్లడించింది.

వివరాలు 

ఈ సంస్థలు స్వీయ ఆడిట్లు పూర్తి చేసి డార్క్ ప్యాటర్న్స్‌ను తొలగించాయి 

ఫాల్‍స్ అర్జెన్సీ, బాస్కెట్ స్నీకింగ్, కన్ఫర్మ్ షేమింగ్, ఫోర్స్డ్ యాక్షన్, సబ్‌స్క్రిప్షన్ ట్రాప్, ఇంటర్‌ఫేస్ ఇంటర్‌ఫియరెన్స్, బైట్ & స్విచ్, డ్రిప్ ప్రైసింగ్, దాచిన ప్రకటనలు, నిరంతరంగా ఇబ్బంది పెట్టే నోటిఫికేషన్లు,తప్పుదారి పట్టించే పదాలు, సాస్ బిల్లింగ్, రోగ్ మాల్వేర్ వంటి పద్ధతులన్నీ సాధారణంగా డార్క్ ప్యాటర్న్స్‌గా పిలవబడతాయి. డార్క్ ప్యాటర్న్స్ తొలగించామని ప్రకటించిన సంస్థలు ఇవే : ఫార్మ్‌ఈజీ, జప్టో మార్కెట్‌ప్లేస్,ఫ్లిప్‌కార్ట్, మింత్రా,వాల్‌మార్ట్ ఇండియా,మేక్‌మైట్రిప్,బిగ్‌బాస్కెట్,జియోమార్ట్,జొమాటో,స్విగ్గీ, బ్లింకిట్,పేజ్ ఇండస్ట్రీస్,విలియమ్ పెన్,క్లియర్‌ట్రిప్,రిలయన్స్ జ్యువెల్స్, రిలయన్స్ డిజిటల్,నెట్‌మెడ్స్, టాటా 1ఎంజీ, మీషో, ఇక్సిగో, హామ్‌లేస్, అజియో, టిరా బ్యూటీ, డ్యూరోఫ్లెక్స్, కూరాడెన్ ఇండియా. ఈ సంస్థలు స్వీయ ఆడిట్లు పూర్తి చేసి డార్క్ ప్యాటర్న్స్‌ను తొలగించినట్లు తెలిపాయి.