Page Loader
Boeing: బోయింగ్ నూతన సీఈఓగా "కెల్లీ" ఓర్ట్‌బర్గ్
బోయింగ్ నూతన సీఈఓగా "కెల్లీ" ఓర్ట్‌బర్గ్

Boeing: బోయింగ్ నూతన సీఈఓగా "కెల్లీ" ఓర్ట్‌బర్గ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2024
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

రెండవ త్రైమాసికంలో $1.4 బిలియన్ల నష్టాన్ని నివేదించిన తర్వాత విమాన తయారీ సంస్థ బోయింగ్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా బోయింగ్ CEO డేవ్ కాల్‌హౌన్ స్థానంలో "కెల్లీ" ఓర్ట్‌బర్గ్ నియమించింది. ఈ నిర్ణయం ఆగస్టు 8 నుండి అమల్లోకి వస్తుందని పేర్కొంది. సరఫరాదారు రాక్‌వెల్ కాలిన్స్ మాజీ CEO అయిన రాబర్ట్ "కెల్లీ" ఓర్ట్‌బర్గ్ కొత్త CEOగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. ఈ దిగ్గజ కంపెనీలో చేరినందుకు తాను చాలా గౌరవంగా, వినయంగా ఉన్నానని రాబర్ట్ "కెల్లీ" వెల్డించారు.

Details

బోయింగ్ సంస్థను అగ్రస్థానంలో నిలుపుతా

బోయింగ్‌ పరిశ్రమను అగ్రగామిగా నిలిపి, భద్రత నాణ్యతతో పరంగా ముందంజలో ఉంచుతానన్నారు. 1,70,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో కలిసి పనిచేయడానికి తాను సంతోషంగా ఉన్నాన్నారు. సీఈఓగా పనిచేసిన డెన్నిస్ ముయిలెన్‌బర్గ్ హాయాంలో క్రాష్‌లు, ఆర్థిక నష్టాలు ఎక్కువగా జరిగాయి. ఓర్ట్‌బర్గ్ 1983లో టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఇంజనీర్‌గా ఏవియేషన్ పరిశ్రమలో పనిచేశారు. ఆపై 1987లో ప్రోగ్రామ్ మేనేజర్‌గా రాక్‌వెల్ కాలిన్స్‌లో చేరాడు. 2013లో రాక్‌వెల్ కాలిన్స్‌కి అతను సీఈఓ అయ్యాడు. 2021లో ఆ కంపెనీ నుండి పదవీ విరమణ పొందాడు.

Details

ఓర్ట్ బర్గ్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధం

కెల్లీ ఏరోస్పేస్ పరిశ్రమలో అనుభవజ్ఞుడైన నాయకుడిగా, కాంప్లెక్స్ ఇంజనీరింగ్, తయారీ కంపెనీలను నడపడంలో ఓర్ట్ బర్గ్ చాలా కృషి చేశాడని బోయింగ్ ఛైర్మన్ స్టీవెన్ మోలెన్‌కోఫ్ తెలిపారు. తాము అతనితో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. రెండు రోజుల ముందు బోయింగ్‌తో ప్రొడక్షన్ కాంట్రాక్టు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సైయెంట్ డీఎల్ఎం వెల్లడించింది. ఈ కాంట్రాక్టు భాగంలో 787 డ్రీమ్ లైనర్ కోసం బ్యాటరీ డియోడ్ మాడ్యుల్ తయారు చేయాల్సి ఉంటుంది.