ట్విట్టర్‌పై దావా వేసిన మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, అధికారులు; ఎందుకో తెలుసా?
ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరు ఎలోన్ మస్క్‌పై దావా వేశారు. తమకు ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ బకాయిలు ట్విట్టర్ చెల్లించాలని తమ దావాలో పేర్కొన్నారు. చట్టబద్ధంగా బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత ట్విట్టర్‌కు ఉందని వారు డిమాండ్ చేశారు. పరాగ్ అగర్వాల్‌తో పాటు మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, మాజీ చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ గద్దె ఈ దావా వేశారు.
రీయింబర్స్‌మెంట్ బిల్లులు చెల్లించాలని దావా
ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన తర్వాత కంపెనీ నుంచి తొలిగించిన వారిలో కీలక స్థానాల్లో పరాగ్ అగర్వాల్ తో పాటు నెడ్ సెగల్, విజయ గద్దె ఉన్నారు. కాంగ్రెస్ విచారణలకు సంబంధించిన రీయింబర్స్‌మెంట్ బిల్లులు చెల్లించాలని దావాలో ముగ్గురు మాజీ ఉద్యోగులు పేర్కొన్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విచారణలకు సంబంధించిన ఖర్చులను దావాలో పొందుపర్చారు. మస్క్ ట్విటర్ షేర్‌లను కొనుగోలు చేసినప్పుడు సెక్యూరిటీల నిబంధనలను అనుసరించారా? లేదా? అనే దానిపై ఎస్ఈసీ దర్యాప్తు చేస్తోంది. అయితే విచారణకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు.