Gold and Silver Prices: బంగారం,వెండి కొనేవారికి ఊరట.. మళ్లీ తగ్గిన ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది కాస్త ఊరటనిచ్చే పరిణామమే. గత కొన్ని వారాలుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా భారీగా పెరిగిన పసిడి ధరలు.. తాజాగా వరుసగా రెండుమూడు రోజులుగా స్వల్పంగా తగ్గుతున్నాయి. ఓ దశలో తులం బంగారం ధర రూ.2 లక్షలకు చేరుతుందనే అంచనాలు కూడా వినిపించాయి. అయితే అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాల ప్రభావంతో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల జోరుకు కొంత బ్రేక్ పడింది. దీంతో గత రెండు మూడు రోజులుగా ఈ విలువైన లోహాల ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
వివరాలు
వడ్డీ రేట్లు పెరిగితే బంగారంపై ప్రభావం ఇలా..
సాధారణంగా అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు లేదా యూఎస్ ట్రెజరీ బాండ్ల రాబడులు పెరిగిన సందర్భంలో పెట్టుబడిదారుల ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది.
వడ్డీ వచ్చే ప్రభుత్వ బాండ్ల వైపు వారు ఎక్కువగా మొగ్గు చూపుతారు. అదే సమయంలో బంగారంపై పెట్టుబడుల ఆకర్షణ కొంత తగ్గుతుంది.
బంగారంపై ఎలాంటి వడ్డీ ఆదాయం లభించకపోవడంతో.. వడ్డీ ఇచ్చే గవర్నమెంట్ బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికే ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతారు.
ఫలితంగా గోల్డ్‌కు డిమాండ్ తగ్గి దాని ధరలు కూడా కొంత దిగివస్తాయి.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7, సోమవారం హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
వివరాలు
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,54,790గా కొనసాగుతోంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,41,890గా ఉంది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1,54,790గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రేటు రూ.1,41,890 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,660గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,600గా ఉంది.
విశాఖపట్నంలోనూ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,660గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల ధర రూ.1,43,600గా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,56,660గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,43,600గా నమోదైంది.
వివరాలు
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,790గా ఉంది. 22 క్యారెట్ల రేటు రూ.1,41,890 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,660గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,43,600గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,940గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,040గా ఉంది.
వివరాలు
దేశవ్యాప్తంగా వెండి ధరలు
బంగారంతో పాటు వెండి ధరల్లోనూ మార్పు కనిపించింది. హైదరాబాద్, చెన్నై నగరాల్లో కిలో వెండి ధర రూ.2,54,800గా కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,49,900 వద్ద ట్రేడవుతోంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, పుణె నగరాల్లోనూ కిలో వెండి ధర రూ.2,49,900గా కొనసాగుతోంది.
గమనిక: బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారుతుంటాయి. పై ధరల్లో జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, ఇతర స్థానిక పన్నులు కలిసివుండకపోవచ్చు.