Gold-Silver Rates: తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
గోల్డ్ లవర్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఇటీవల స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ దూసుకుపోతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు, శుభాకార్యాలు జోరుగా సాగుతున్న సమయంలో ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈరోజు తులం బంగారం ధరపై రూ.1,910 పెరుగుదల నమోదైంది. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,280 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,750 పెరగడంతో అది రూ.1,46,000కు చేరింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,430 పెరిగి రూ.1,19,460 వద్ద కొనసాగుతోంది.
Details
ఈరోజు కిలో వెండిపై రూ.5,000 పెరగుదల
వెండి ధర కూడా అదే రీతిలో భారీగా పెరిగింది. ఈరోజు కిలో వెండిపై రూ.5,000 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో అది రూ.2,75,000 వద్ద అమ్ముడవుతోంది. అయితే హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర మరింత ఎక్కువగా రూ.2,90,000 వద్ద ట్రేడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కూడా కిలో వెండి రూ.2,75,000 వద్దనే కొనసాగుతోంది. ధరల ఈ పెరుగుదలతో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారు మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.