Loading...
Gold and Silver Prices: బంగారం,వెండి ధరల్లో మార్పు లేదు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!
బంగారం,వెండి ధరల్లో మార్పు లేదు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!

Gold and Silver Prices: బంగారం,వెండి ధరల్లో మార్పు లేదు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 26, 2026
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లో బంగారం,వెండి ధరలు సోమవారం (అక్టోబర్ 26) స్థిరంగా కొనసాగుతున్నాయి. గత శుక్రవారం (అక్టోబర్ 23) నుంచి బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 7 గంటల సమయానికి ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,570గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,630 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,06,930గా నమోదైంది. వెండి ధరలోనూ ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి రూ.2,19,900 వద్ద ట్రేడవుతోంది.

వివరాలు 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,630గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, అమరావతి,కాకినాడ, తిరుపతి నగరాల్లో మాత్రం ఇదే బంగారం ధర రూ.1,30,690గా నమోదైంది.

తెలంగాణతో పోలిస్తే ఏపీ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.60 ఎక్కువగా ఉంది.

రెండు రాష్ట్రాల్లోనూ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,570 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి.

గమనిక: ఈ ధరలు ఉదయం 7 గంటల సమయానికి అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చినవి.నగరం,ఆభరణాల తయారీ,తరుగు,జీఎస్టీ వంటి అంశాలను బట్టి కొనుగోలు సమయంలో ధరలు మారవచ్చు.

ADVERTISEMENT