Gold Prices Today: బంగారం కొనాలనుకునే వారికి షాక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు మళ్లీ పెరగడంతో కొనుగోలుదారులకు నిరాశ ఎదురవుతోంది. గత వారం నుంచి వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. గత రెండు రోజులుగా మళ్లీ పైకి కదులుతున్నాయి. మంగళవారం ఉదయం ధరలతో పోలిస్తే తాజాగా బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,43,300గా ఉంది. మంగళవారం ఉదయం ఈ ధర రూ.1,42,760గా ఉండగా.. తాజాగా తులంపై సుమారు రూ.540 పెరిగింది. మరోవైపు వెండి ధర కాస్త తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,19,900గా ఉంది.
వివరాలు
నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
మంగళవారం కిలో వెండి ధర రూ.2,20,000గా ఉండటంతో తాజాగా రూ.100 తగ్గినట్లయింది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,300గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,360 వద్ద కొనసాగుతోంది.
విజయవాడ, విశాఖపట్నంలోనూ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,300గా ఉంది.
22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,360గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,450గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,510 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,300గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,360గా ఉంది.
బెంగళూరులోనూ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,300గా,22 క్యారెట్ల ధర రూ.1,31,360గా నమోదైంది.
వివరాలు
వెండి ధరలు..
చెన్నైలో కిలో వెండి ధర రూ.2,19,900గా ఉంది. మంగళవారం ఈ ధర రూ.2.20 లక్షలుగా నమోదైంది.
బెంగళూరులోనూ కిలో వెండి ధర రూ.2,19,900 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,19,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ కిలో వెండి ధర రూ.2,19,900 వద్ద ట్రేడవుతోంది.