Loading...
Gold Price Today: తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Gold Price Today: తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2026
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి కొంత ఊరట కలిగించే పరిణామం కనిపించింది. గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం,వెండి ధరలు ప్రస్తుతం స్వల్పంగా తగ్గాయి. శనివారంతో పోలిస్తే ధరల్లో పెద్దగా మార్పు లేకపోయినా.. రెండు విలువైన లోహాల రేట్లు కాస్త దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, డాలర్ విలువలో మార్పులు వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. సోమవారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,340గా నమోదైంది. ఆదివారం ఉదయం ఇదే ధర రూ.1,52,350గా ఉంది. అంటే 10 గ్రాములపై రూ.10 తగ్గింది.

వివరాలు 

వెండి ధరల్లోనూ ఇదే తరహా స్వల్ప మార్పు

మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ప్రస్తుతం రూ.1,39,640గా కొనసాగుతోంది. అంతకుముందు రోజు ఈ రేటు రూ.1,39,650గా ఉండటంతో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 తగ్గింది.

వెండి ధరల్లోనూ ఇదే తరహా స్వల్ప మార్పు కనిపించింది. శనివారంతో పోలిస్తే వెండి రేటు కొద్దిగా తగ్గింది.

హైదరాబాద్‌ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,49,800గా ఉంది. ఆదివారం కిలో వెండి రేటు రూ.2,49,900గా కొనసాగింది. దీంతో కిలో వెండిపై రూ.100 తగ్గుదల నమోదైంది.

వివరాలు 

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,340గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,39,640గా కొనసాగుతోంది.

విజయవాడలోనూ హైదరాబాద్‌ మాదిరిగానే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,340గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,39,640గా నమోదైంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,540గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.1,38,840గా కొనసాగుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,340గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,39,640గా నమోదైంది.

ADVERTISEMENT

వివారాలు 

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,340గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,39,640గా ఉంది.

చెన్నైలో మాత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,630గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,38,990గా కొనసాగుతోంది.

గమనిక: బంగారం, వెండి ధరలు రోజులో పలుమార్లు మారే అవకాశం ఉంటుంది. నగలు కొనుగోలు చేసే సమయంలో ఆయా ప్రాంతాల్లో అమలులో ఉన్న ధరలను, అలాగే జీఎస్టీ, తయారీ ఛార్జీలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.

ADVERTISEMENT