Loading...
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందంటే..

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2026
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరుగుదల దిశగా సాగుతున్నాయి. కొంతకాలం క్రితం రికార్డు స్థాయికి చేరుకుని కొనుగోలుదారులకు భారంగా మారిన పసిడి ధరలు ఇటీవల స్వల్పంగా తగ్గినా.. ఆ తగ్గుదల ఎక్కువకాలం కొనసాగలేదు. వరుసగా మళ్లీ పెరుగుతుండటంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బులియన్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్-రూపాయి మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు, ప్రపంచ మార్కెట్ ప్రభావం వంటి అంశాల కారణంగా బంగారం,వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోమవారం,మంగళవారం నమోదైన పెరుగుదలతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రెండు రోజుల్లో కలిపి దాదాపు రూ.1000 మేర పెరిగింది.

వివరాలు 

దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు

బుధవారం కూడా బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.

పలు బులియన్ వెబ్‌సైట్లలో నమోదైన వివరాల ప్రకారం.. బుధవారం (జులై 22) ఉదయం 6 గంటల వరకు దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.10 పెరిగి రూ.1,44,230కు చేరుకుంది.

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర కూడా రూ.10 పెరిగి రూ.1,32,210గా నమోదైంది.

వెండి (కిలో) ధర మాత్రం రూ.100 తగ్గి రూ.2,34,900గా కొనసాగుతోంది.

అయితే బంగారం,వెండి ధరలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, రవాణా ఖర్చులు, రాష్ట్రాల వారీ పన్నులు వంటి అంశాల ప్రభావంతో ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తాయి.

వివరాలు 

ప్రధాన నగరాల్లో తాజా బంగారం, వెండి ధరలు

హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,44,230 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,32,210 వెండి (కిలో): రూ.2,40,100

విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,44,230 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,32,210 వెండి (కిలో): రూ.2,40,100

ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,44,380 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,32,360 వెండి (కిలో): రూ.2,34,900

ముంబై: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,44,230 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,32,210 వెండి (కిలో): రూ.2,34,900

చెన్నై: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు):రూ.1,44,230 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,32,210 వెండి (కిలో): రూ.2,40,100

ADVERTISEMENT

వివరాలు 

గమనిక 

బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,44,230 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,32,210 వెండి (కిలో): రూ.2,34,900

బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారు కొనుగోలు చేసే ముందు తమ ప్రాంతంలోని జువెలరీ దుకాణాలు లేదా స్థానిక బులియన్ మార్కెట్‌లో తాజా ధరలను ఒకసారి తప్పనిసరిగా పరిశీలించడం మంచిది.

ఎందుకంటే ప్రాంతాల వారీగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

బంగారం,వెండి ధరలకు సంబంధించిన తాజా అప్‌డేట్ల కోసం 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

ADVERTISEMENT