Loading...
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2026
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి ధరల పెరుగుదల షాక్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువలో వచ్చిన మార్పులు బంగారం,వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజా మార్కెట్ వివరాల ప్రకారం సోమవారం ఒక్కరోజే 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.180 పెరిగింది. పలు బులియన్ వెబ్‌సైట్లలో నమోదైన వివరాల ఆధారంగా మంగళవారం (జులై 21) ఉదయం 6 గంటల వరకు దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.

వివరాలు 

వెండి ధర

ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.1,43,470కు చేరుకుంది.

అదే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా రూ.10 పెరిగి రూ.1,31,510గా నమోదైంది. వెండి ధర కూడా పెరుగుదల నమోదు చేసింది.

కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.2,35,100గా కొనసాగుతోంది.

వివరాలు 

ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు

హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,43,470 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,31,510 వెండి (కిలో): రూ.2,34,900

విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,43,470 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,31,510 వెండి (కిలో): రూ.2,34,900

ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,43,620 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,31,660 వెండి (కిలో): రూ.2,35,100

ముంబై: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,43,470 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,31,510 వెండి (కిలో): రూ.2,35,100

ADVERTISEMENT

వివరాలు 

ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు

చెన్నై: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,43,470 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,31,510 వెండి (కిలో): రూ.2,34,900

బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,43,470 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,31,510 వెండి (కిలో): రూ.2,35,100

అయితే బంగారం, వెండి ధరలు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా పరిస్థితులు, రాష్ట్రాల వారీగా అమలయ్యే పన్నులు, రవాణా వ్యయాలు వంటి అంశాల ప్రభావంతో నగరానికో ధర మారుతూ ఉంటుంది.

అందువల్ల కొనుగోలు చేసే ముందు స్థానిక జువెలరీ దుకాణాల్లో తాజా ధరలను ఒకసారి నిర్ధారించుకోవడం మంచిది.

ADVERTISEMENT